వేసవిలో ముఖ సౌందర్యం కోసం ఇలా చెయ్యండి..
దీనితో మీకు ఏ సమస్యలు రావు.కూలింగ్ ఏజెంట్ కింద ఇది పని చేస్తుంది. కాబట్టి ఈ టిప్స్‌ని మీరు మంచిగా అనుసరిస్తే సమ్మర్‌లో మీ చర్మానికి ఏ సమస్యా ఉండదు. ఎప్పటి లాగే మీరు అందంగా ఉండచ్చు.సమ్మర్‌లో సూర్య కిరణాల నుంచి కాపాడుకోవడానికి క్రీమ్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉంటాయి. దీని వల్ల ముఖంపై సమస్యలు వస్తాయి. వాటి నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే తప్పకుండా బయటకు వెళ్ళినప్పుడు మీరు సన్ స్క్రీన్ లోషన్ ని వాడండి. మీరు ఉపయోగించే సన్ స్క్రీన్ లోషన్ లైట్‌గా ఉండేటట్లు చూసుకోండి. ఇది మాత్రం మరచిపోకండి.అదే విధంగా మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉండే వాటిని ఎంచుకోవాలి. అది బ్రాడ్ స్పెక్ట్రం క్రీమ్ అయితే మంచిది.
అప్పుడు అది యువిఏ కిరణాల నుంచి యువీబీ కిరణాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. మీరు బయటకు వెళ్ళినప్పుడు వర్కౌట్ చేసేటప్పుడు ఇలా దేని కోసం బయటికి వెళ్ళినా సరే తప్పకుండా సన్ స్క్రీన్ లోషన్ ని వాడండి దీనితో మీకు కొన్ని ఇబ్బందులు రాకుండా ఉంటాయి.టోనింగ్‌కి ఇంకా మాయిశ్చరైజింగ్‌కి హైడ్రోస్ బాగా ఉపయోగపడతాయి. మీరు స్ప్రే చేసి కూడా దానిని ఉపయోగించ వచ్చు. దాని వల్ల మీ చర్మం ఫ్రెష్, కూల్‌గా ఉంటుంది. పైగా అది సూతింగ్‌గా కూడా ఉంటుంది. కళ్ళకి కూడా చల్లదనాన్ని ఇస్తుంది. అదే విధంగా మీ కంటి భాగంలో చల్లగా, ఫ్రెష్‌గా ఉంచితే ఇబ్బందులు కూడా రావు.కాబట్టి ఈ పద్ధతులు పాటించండి.