ఎండాకాలం నుంచి చర్మాన్ని కాపుడుకోవడానికి ఈ విధంగా సన్ స్క్రీన్ ఉపయోగించండి...

Purushottham Vinay
ఈ ఎండాకాలంలో సూర్యుని తాపం నుండి మన చర్మాన్ని కాపాడడానికి సన్ స్క్రీన్ ను తప్పకుండా ఉపయోగించాలి. సూర్యుడి నుండి వచ్చే యువి కిరణాలు వల్ల సన్ బర్న్ జరుగుతుంది. సన్ బర్న్‌కు కారణం సూర్యకిరణాలే కాదు ఆర్టిఫిషియల్ లైట్స్ ద్వారా కూడా సన్ బర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. మన చర్మం యొక్క రంగు మెలనిన్ అనే పిగ్మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సన్ బర్న్ మన చర్మానికి జరిగితే, మన చర్మం నిగారింపు కోల్పోతుంది. అదే ఒకవేళ సన్ స్క్రీన్ ను ఉపయోగిస్తే బయటకు వెళ్లి వచ్చిన మన స్కిన్ టోన్ లో ఎటువంటి మార్పు జరగదు.కాబట్టి అటువంటి హానికరమైన కిరణాల నుండి తప్పించుకోవడానికి సన్ స్క్రీన్‌ను ఉపయోగించాలి. ఒకవేళ ఈ హానికరమైన కిరణాలు మన చర్మంపై ఎక్కువగా పడితే మన చర్మంపై త్వరగా ముడతలు పడతాయి మరియు చర్మ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.

కాబట్టి యువి కిరణాల నుండి దూరంగా ఉండాలంటే సన్ స్క్రీన్ ను ప్రతి రోజు తప్పక ఉపయోగించాలి.ముఖాన్ని శుభ్రంగా ఫేస్ వాష్ చేసిన తర్వాత సన్ స్క్రీన్ ను ఉపయోగించండి. తగినంత సన్ స్క్రీన్ లోషన్ ను చేతిలోకి తీసుకొని ముఖానికి రాసుకొని మసాజ్ చేయండి. దాంతో అది చర్మంలోకి వెళ్తుంది. మీ మేకప్ ఉత్పత్తులు ఉపయోగించే ముందే సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ముఖానికే కాకుండా సూర్యకిరణాలు పడేటువంటి మెడ, చెవులు, చేతులు, పాదాలకు కూడా రాసుకోవచ్చు. అలా అయితే ఎటువంటి స్కిన్ టోన్ మార్పు కనబడదు. సాధారణమైన సన్ స్క్రీన్ ను ఉపయోగిస్తే ఏ రకమైన ఉపయోగం ఉండదు.
30 లేదా అంతకంటే ఎక్కువ ఎస్ పి ఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ ను వాడాలి ఇంకా ఆ సన్ స్క్రీన్ లో వాటర్ రెసిస్టెన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు ప్రతిసారి సన్ స్క్రీన్ ను ఉపయోగించండి. సాధారణంగా సన్ స్క్రీన్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: