పట్టులాంటి జుట్టు సొంతం కావాలంటే ఇంట్లోనే ఈ నూనె ను తయారు చేసుకోవచ్చు..!
వాతావరణంలో కాలుష్యం, మనం తీసుకునే ఆహారంలో పోషకాల లోపం వంటి కారణాలవల్ల ప్రతి ఒక్కరికి జుట్టురాలే సమస్య, అతి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇందు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో డబ్బులు కూడా ఖర్చు చేసి, విసుగు చెంది ఉంటారు చాలామంది. అయితే ఇప్పుడు ఇలాంటి వాటన్నింటికీ చెక్ పెట్టాలంటే ఇంట్లోనే ఒక నూనెను సిద్ధం చేసుకోవచ్చు. ఈ నూనె జుట్టుకు కావలసిన పోషకాలను అందించి , శిరోజాలు మృదువుగా, కాంతిని సంతరించుకోవడం లో సహకరిస్తుంది.. అయితే ఈ నూనె ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు :
కొబ్బరి నూనె - ఒక లీటర్,
మందారం పువ్వు లు - 20,
వేపాకులు - 30,
కరివేపాకు రెబ్బలు - 30,
ఉల్లిపాయలు - 5,
మెంతులు - ఒక టేబుల్,
కలబంద గుజ్జు - నాలుగు టేబుల్ స్పూన్లు,
మల్లె పువ్వులు 10 నుంచి 15..
తయారీ విధానం:
మెంతులను ఒక అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. ఇక ఇప్పుడు పైన చెప్పిన వాటన్నింటిని మిక్సీ లో వేసి పేస్టు లాగా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని కొబ్బరి నూనెలో కలపాలి. ఇక దీనిని 45 నిమిషాల పాటు మీడియం సైజు మంటపై మరిగిస్తే, ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. ఆ తర్వాత దీనిని చల్లార్చి ఒక గాజుసీసాలో కి వడపోసి భద్రపరుచుకోవచ్చు..
ఇక మీరు దీనిని ఎప్పుడైనా తలకు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు, కొద్దిగా గోరువెచ్చగా డబుల్ బాయిలింగ్ పద్ధతిలో బాయిల్ చేసుకొని, జుట్టు కుదుళ్లకు పట్టించి, బాగా మసాజ్ చేయాలి. అయితే ఈ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే జుట్టుకు పట్టించాలి. అయితే వారానికి రెండు సార్లు ఈ జుట్టు ను జుట్టు కుదుళ్ళకు పట్టించి, బాగా మసాజ్ చేయడం వల్ల కాంతివంతమైన జుట్టు సొంతం అవుతుంది.. అంతేకాకుండా వీటిలో ఉపయోగించిన మందార పూలు, కరివేపాకు, ఉల్లిపాయ జుట్టు కుదుళ్లను బలం గా మారుస్తాయి. ఇక వేపాకు చుండ్రు సమస్యను, పేలను నివారిస్తుంది. కలబంద జుట్టు పొడవుగా పెరిగే లాగా చేసి, ఇక కురుల అందాన్ని పెంచడానికి మెంతులు సహాయపడితే, చక్కని పరిమళాన్ని అందజేయడంలో మల్లెపూలు కీలకపాత్ర పోషిస్తాయి.
చూశారు కదా.. మీరు కూడా మీ ఇంట్లో ఒక సారి ఈ నూనె ను తయారు చేసుకొని, మీరు కూడా ట్రై చేయండి తప్పక ఫలితం పొందవచ్చు..