బ్యూటీ : తెల్లటి ముఖం కోసం ఈ పద్ధతులు పాటించండి....
బంగాళదుంపను కట్ చేసి, ముఖానికి అప్లై చేస్తూ మర్దన చేయాలి.బాదం నూనె ఒక న్యాచురల్ రెమెడీ. ఇది నలుపు తగ్గించడంలో రెగ్యులర్ గా ఈ నూనెను మెడకు అప్లై చేయవచ్చు. నూనెను గోరువెచ్చగా చేసి తర్వాత ముఖానికి అప్లై చేయాలి. ఈ పద్దతిని రోజూ ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది.విటమిన్ సి చర్మంలో గొప్ప మార్పులు తీసుకొస్తుంది. ఆరెంజ్ పీల్ పౌడర్ నలుపుని తగ్గిస్తుంది. అందుకోసం అరటీస్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకుని, అందులో ఒక టీస్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి పూర్తిగా అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ముందుగా ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత కోకనట్ మిల్క్ లో కాటన్ ప్యాడ్ ను డిప్ చేసి ముఖానికి అప్లై చేస్తూ సున్నితంగా మసాజ్ చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో సౌందర్య చిట్కాల గురించి తెలుసుకోండి...