ముఖం అందంగా మెరవాలంటే ఈ ఫేస్ ప్యాక్ తప్పనిసరి..!

Divya

సాధారణంగా ముఖం అందంగా మెరవాలంటే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  అందులో భాగంగానే ముఖానికి క్రీములు రాయడం, ఫేస్ ప్యాక్ లు వేయడం లాంటివి చేస్తూ ఉంటారు . అయితే మన స్కిన్ కు తగ్గట్టుగా, మనం ఎంచుకునే క్రీమ్ లేదా ఫేస్ ప్యాక్ కూడా అనువుగా ఉండాలి. ఒక్కొక్క చర్మ తత్వాన్ని బట్టి ఒక్కొక్క రకం ఫేస్ ప్యాక్ ను అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఆ ఫేస్ ప్యాక్ రిజల్ట్ కనిపిస్తుంది. అయితే అన్ని రకాల చర్మ తత్వానికి సంబంధించి ఇప్పుడు ఒకే ఒక ఫేస్ ప్యాక్ మీ ముందుకు తీసుకువచ్చాము. అదేమిటో.. దానిని ఎలా తయారు చేసుకోవాలో.. దాని ఫలితాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


ఆ పేస్ ప్యాక్ ఏదో కాదు..క్యారెట్ ఫేస్ ప్యాక్. ఈ క్యారెట్ ఫేస్ ప్యాక్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా విటమిన్ ఏ కంటే చర్మానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా క్యారెట్ లో బీటాకెరోటిన్,విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి.వీటిని ముఖవర్చస్సు మెరవాలంటే తప్పకుండా ఉపయోగించాలి.


ఇందుకోసం నాలుగు టేబుల్ స్పూన్ల క్యారెట్ రసంలో, రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి రసం, అలాగే కొద్దిగా పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని  ముఖానికి పట్టించి, 40 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే, ముఖం కాంతివంతంగా మారుతుంది. అంతే కాకుండా క్యారెట్లో యాంటీఏజింగ్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ రసంలో, కొంచెం అరటిపండు గుజ్జు, గుడ్డులోని తెల్లసొన,నాలుగు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే, ముఖం మీద ముడతలు తగ్గడం గమనించవచ్చు.


అలాగే ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా అందంగా కనిపిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: