వేసవికాలంలో ముఖాన్ని చల్లగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసా..?

Divya

వేసవికాలంలో మరీ ముఖ్యంగా పొల్యూషన్ నుంచి తట్టుకోవాలన్నా, సూర్యుని నుండి వెలువడే సూర్యకిరణాల బారినపడకుండా ఉండాలన్నా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకునే జాగ్రత్తల లో  ఏ చిన్న పొరపాటు జరిగినా, అది ముఖాన్ని మొత్తం పాడు చేస్తుంది అని గుర్తించుకోవాలి. ఈ వేసవి కాలంలో ముఖాన్ని కాపాడుకోవాలంటే మాత్రం క్రీమ్స్, కాస్మెటిక్స్ కు దూరంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. ఒకవేళ ఈ కాస్మెటిక్స్ వాడడం వల్ల చర్మం పొడిబారిపోవడం, నల్ల మచ్చలు రావడం వంటివి జరగడం వల్ల చూడడానికి అందవిహీనంగా కనిపిస్తారు. అయితే ఈ వేసవి కాలంలో ముఖాన్ని తాజాగా, చల్లగా ఉంచుకోవాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు ఇప్పుడు చదివితే తెలుసుకుందాం..


పుదీనా ఫేస్ ప్యాక్ :
పుదీనా ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఈ ఎండాకాలంలో ముఖాన్ని చల్లగా ఉంచుకోవడమే కాకుండా తాజాగా కూడా ఉంచుకోవచ్చు. అయితే ఇందుకోసం తాజా పుదీనా ఆకులను తీసుకొని, వాటినుండి  రసం తీయాలి. ఈ రసానికి కొద్దిగా తేనె కలిపి ముఖము అంతటా సమపాలల్లో అప్లై చేయాలి. ఆ తర్వాత పదిహేను నిమిషాలు ఆరనిచ్చి, శుభ్రంగా చల్లని నీటితో కడుక్కోవాలి. ఈ ప్యాక్ వేసుకొన్న రోజు మాత్రం సబ్బులను వాడడం మంచిది కాదు.


ఫేస్ వాష్ :
గంటకు ఒకసారి అయినా నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవడం ఉత్తమం. అయితే ప్రతి సారి సోప్ పెట్టాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే చర్మానికి కావలసిన తేమ అందుతుంది..


శరీరం డీహైడ్రేట్ గా ఉంచుకోవాలి :
మనకి బయట నుంచే కాకుండా లోపలి నుంచి కూడా పోషణ అందించాలి. అయితే అందుకోసం మంచి నీళ్లని ఈ వేసవి కాలంలో ఎక్కువగా తాగాలి. ఒకవేళ ఈ నీటిని తాగడం ఇష్టం లేనివారు తాజా పండ్ల రసాలను తాగడం ఉత్తమం. అయితే ఈ రసాలు కూడా ఇంట్లో తయారు చేసుకొని తాగడం మరీ మంచిది..


ఐస్ క్యూబ్ :
ఐస్ ముక్కలతో ముఖం మీద మర్ధన చేయడం వల్ల కూడా చర్మం మీద ఉన్న నల్లటి మచ్చలు తగ్గే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా చల్లగా, తాజాగా ఉంటుంది. కాబట్టి పైన చెప్పిన చిట్కాలను మీరు కూడా పాటించి ఈ వేసవి కాలం నుండి వచ్చే చర్మ సమస్యల నుండి దూరంగా ఉండండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: