యుక్తవయసులో క్రీముల వల్ల ప్రయోజనం ‘‘ సున్నా’’

Durga
మొటిమలు ఏర్పడటానికి కారణం ఆండ్రోజన్ కాబట్టి, మీరు మీ ఆహారపుటలావాట్లను మార్చుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. మీకు చాక్లెట్లను ఎక్కువగా నమిలే అలవాటు వుంటే మొటిమలకోసం, వాటిని వదులకోనక్కర్లేదు. మొటిమలు పోవటానికి, బజార్లో అమ్మే క్రీములను ఉపయోగించినా ఫలితం ఉండదు. అవి మొటిమలు ఏర్పడటానికి ప్రధానంగా దారితీసే పరిస్థితిని నిరోధించలేవు. మీ చర్మంలోని నూనె గ్రంధులు, ఏ కారణం చేత అవలోధమేర్పరచబడినాయో, ఆ ధాతువులను నిర్మూలించే పధార్థం ఏదీ మొటిమల క్రీములలో వుండదు. కాగా కొన్ని క్రీములు, మీ ముఖంలోని జిడ్డును మాత్రమేతగ్గంచి, పొడిగా వుంచే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి. చర్మసౌందర్యాన్ని పెంచే సౌందర్య సాధనాలేవి మొటిమల నిర్మూలనకు సాయపడలేవు. మొటిమలు ఏర్పడటం, యుక్త వయసులో ఒక సర్వసాధారణమైన చర్య కొంతకాలానికి ఇవి వాటంతట అవే రాలిపోతాయి. ఇవి ఇన్ఫెఫెక్ట్ అయినపుడు మాత్రమే వైద్యుల అవసరం ఏర్పడ్తుంది. అంతవరకూ, ముఖం మీద మొలిచే మొటిమలు వల్ల ఏవిధమైన సమస్యావుండదు. అందంగా ఐశ్వర్యారాయ్ లా కనబడాలనుకునే ఆడిపిల్లలు, తమ ముఖం మీద వచ్చే మొటిమలను చూసుకుని అనవసరంగా వర్రీ అవుతూ, వాటిని గోళ్లతో గిల్లి, తొలగించుకోవాలని ప్రయత్నిస్తారు. దీని వల్ల మొటిమలు పోవు సరికదా, గిల్లడం వల్ల ఇక్కడ ఇన్ ఫెక్షన్ సోకి, బ్యాక్టీరియా కారణంగా మచ్చలు ఏర్పడిపోయే ప్రమాదం వుంది. తత్ఫలితంగా ముఖం మీద చెదిరిపోని, మచ్చలు శాశ్వతంగా ఏర్పడిపోతాయి. కాబట్టి మొటిమలు గోళ్ళతో గిల్లరాదని యుక్తవయసులో వున్న పిల్లలంతా గ్రహించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: