కాంతివంతమైన ముఖం కోసం..

Prasad
ఎండకి నల్లబడటాన్ని సన్ ట్యాన్ అంటారు. సాధ్యమైనంతవరకు ఎండలో బయటకు వెళ్లేటపుడు గొడుగు వాడండి. సన్ స్ర్కీన్ లోషన్ వాడండి. అది జిడ్గుగా ఉన్నట్లనిపిస్తే లాక్టోక్యాలమైన్ వాడవచ్చు. దాంతో కొంత వరకు ఎండ ప్రభావం నుంచి కాపాడుకోవచ్చు. సన్ ట్యాన్ పోవడానికి బ్యూటీపార్లర్ లో ఫ్రూట్ ఫేషియల్, వెజిటబుల్ ఫేషియల్, శాండల్ ఫ్యాకులు చేస్తారు. ట్యాన్ తగ్గి ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఎండలో తిరిగి రాగానే చల్లని నీటితో కడుక్కుంటే వేడి తగ్గి హాయిగా ఉంటుంది. ఎండలో తిరిగి రాగానే చల్లని నీటితో కడుక్కుంటే వేడి తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. కీరదోసకాయ, ఆలూలను మెత్తగా గుజ్జులా చేసి ముఖం, చేతులపైన మర్ధన చేసుకోవాలి. అందులోనే కొంచెం గంధం పొడి కలిపిఫ్యాక్ వేసుకుంటే ముఖం కాంతి వంతమవుతుంది. చల్లగా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: