కర్పూరం, కొబ్బరి నూనె కలిపి రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..!

Divya

చర్మ సంరక్షణలో కొబ్బరినూనె ఎంతో దోహదపడుతుంది. చర్మం తాజాగా, మృదువుగా ఉండాలి అంటే కొబ్బరినూనె మొదటి పాత్ర వహిస్తుందని చాలా మందికి తెలుసు. అయితే ఈ కొబ్బరినూనెలో కర్పూరం కలపడం వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి అని చెబుతున్నారు నిపుణులు. ఇది కేవలం చర్మానికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా ఎంతో ఉపకరిస్తుంది. కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి  వాడడం వల్ల శరీరం లోని నొప్పులను తగ్గించడానికి, చర్మ రోగాలు నయం చేయడానికి, ముఖం మీద మచ్చలు, మొటిమలు తగ్గించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా మరి కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతున్నారు. వారు ఆహారంలో తగిన ఆరోగ్యకరమైన పదార్థాలను చేర్చుకోవడం తోపాటు కొబ్బరి నూనె, కర్పూరం కలిపిన నూనె తో జుట్టు కుదుళ్లకు మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య త్వరగా తగ్గుతుంది.


ఇక ముఖం మీద వచ్చే మచ్చలను కూడా తొలగించుకోవచ్చు. ఇందుకోసం కొబ్బరినూనెలో కర్పూరం పొడి వేసి బాగా కలిపి, రాత్రి పడుకునే ముందు మచ్చలపై మసాజ్ చేయాలి. దీని వల్ల మచ్చలు నెమ్మదిగా క్లియర్ అవుతాయి..


అలాగే చేతివేళ్ల గోర్లు, కాలి గోర్లు కూడా కొంతమందికి కుళ్ళిపోయి వికారంగా కనిపిస్తూ ఉంటాయి. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. గోరువెచ్చని నూనెలో కర్పూరం కలిపి, గోరుపై పూస్తూ మసాజ్ చేయాలి. ఇలా తరచూ చేస్తుండడం వల్ల త్వరగా గోళ్ళు అందంగా కనిపిస్తాయి.


మొటిమలకు కూడా ఈ కొబ్బరి నూనె, కర్పూరం చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఇందుకోసం కొబ్బరినూనెలో కర్పూరం కలిపి మొటిమల పైన రాస్తే మంచి ఫలితం ఉంటుంది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స కూడా ఉండవు.  మొటిమలను మచ్చలను తగ్గించి ముఖం అందంగా కనిపించేలా చేస్తుంది..

చూశారు కదా.. కర్పూరం కొబ్బరి నూనె తో చేసే అద్భుతాలు మీరు కూడా ఉపయోగించి,  ఫలితాన్ని పొందండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: