కొబ్బరి నూనెను ఎలా ఉపయోగిస్తే, జుట్టు రాలకుండా ఉంటుందో మీకు తెలుసా..?

Divya

సాధారణంగా మనం కొబ్బరినూనెను  జుట్టు రాలకుండా ఉండేందుకు ఉపయోగిస్తుంటాము. కొబ్బరి నూనె జుట్టు రాలడం, చర్మం పొడిబారడం, నిర్జీవంగా మారడం వంటి అనేక సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తుంది. కొబ్బరి నూనె ను భారతదేశంలోని పురాతన  ఆయుర్వేదంలో ఎన్నో రకాలుగా ఉపయోగించేవారు. అయితే కొబ్బరి నూనెను ఎలా ఉపయోగిస్తే,జుట్టు రాలకుండా ఉంటుందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


కొబ్బరినూనెలో లారిక్ ఆమ్లం మన జుట్టులోని ప్రోటీన్లను బంధించడానికి సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లను కాపాడి, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతే కాకుండా జుట్టు ఒత్తుగా పెరగడానికి సహకరిస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా జుట్టుకు తగినంత తేమ అంది,  జుట్టు మెత్తగా మృదువుగా మారుతుంది.

కొబ్బరి నూనె ఒక జిగట ద్రవం. ఇది సాధారణంగా శరీరంలో ప్రవహించే సెబం ను పోలి ఉంటుంది.  కొబ్బరినూనె జుట్టు కుదుళ్లు పొడిబారకుండా ఉండేలా చేసి, జుట్టు రాలడాన్ని నివారించడమే కాకుండా చుండ్రు ని కూడా అరికడుతుంది. అయితే కొబ్బరి నూనె ను డబుల్ బాయిలింగ్ పద్ధతి లో వేడి చేసి, గోరువెచ్చగా ఉన్నప్పుడు, జుట్టు కుదుళ్లకు పట్టించి, చేతి మునివేళ్లతో మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్ల లో రక్త ప్రసరణ బాగా జరిగి, ఒత్తిడి,అలసట నుంచి ఉపశమనం కలుగుతుంది..

కొబ్బరి నూనె లో జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగించే బ్యాక్టీరియా, ఫంగల్ సమస్యలను తొలగించడానికి యాంటీ ఫంగల్ లక్షణాలు మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలకు అవసరమైన మొత్తం పోషణను అందిస్తుంది. అంతేకాకుండా ఒక సహజసిద్ధమైన కండీషనర్గా కూడా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా, మెరిసేలా ఉండడానికి సహాయపడుతుంది. మీరు వారానికి రెండు లేదా మూడు సార్లు జుట్టుకు కొబ్బరి నూనె పెట్టడం వల్ల ఇన్ని ప్రయోజనాలు కలవు. జిడ్డు అని అనుకున్నా సరే తప్పకుండా జుట్టు కి ఆయిల్ పెట్టడం అలవాటు చేసుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: