అరటి తొక్కతో అలా చేస్తే, మీరు అనుకున్న చోట తప్పక ఫలితం వస్తుంది..

Divya
సీజన్ తో సంబంధం లేకుండా అన్ని వేళలా చౌకగా దొరికే పండు అరటి పండు. అరటి మన శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అని మనకు తెలుసు. ముఖ్యంగా క్రీడాకారులు, అధికంగా శ్రమించేవారు కచ్చితంగా తింటారు. ఎందుకంటే ఈ పండులో పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే మనలో చాలామంది పండును మాత్రమే తిని, తొక్కను విసిరేస్తుంటారు. తొక్కే కదా అని తీసిపారేస్తే..  తిప్పలు తప్పవు అంటున్నారు నిపుణులు. అరటి తొక్క మనకు ఏవిధంగా ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

అరటి తొక్క యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ తొక్కను చర్మంపై రుద్దడం వల్ల చర్మంపై వచ్చే ముడతలు తగ్గుతాయి. అంతే కాకుండా చర్మం కాంతివంతమవుతుంది. కొంతమంది చర్మంపై దురద, దద్దుర్లు వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అలాంటి వారు అరటి పండు తొక్క తో దురద, దద్దుర్లు వచ్చిన చోట రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ అరటి తొక్క దంతాల సంరక్షణకే కాదు.. పళ్ళు మిలమిలా మెరిసేకి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అరటిపండు తొక్క లోపలి భాగాన్ని దంతాలపై రోజూ రుద్దితే క్రమంగా పళ్ళ పైన ఉన్న పసుపుదనం పోయి తెల్లగా మారుతాయి.

అరటి తొక్క హానికరమైన యూవీ కిరణాల నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది. కళ్ళపై అరటి తొక్కతో రుద్దే ముందు, అరటి తొక్కను సూర్యుని ముందు ఉంచి, అనంతరం దానితో కళ్ళపై సున్నితంగా మర్దన చేస్తే కంటి శుక్లాల ప్రమాదం తగ్గుతుందని నిరూపించబడింది. పురుగులు,కీటకాలు కుట్టిన చోట వెంటనే అరటి పండు తొక్క తో రాస్తే ఉపశమనం కలుగుతుంది. అలాగే వెండి, స్టీల్ వస్తువుల పై మరకలు పోవడానికి అరటి పండు తొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది.


కాలిన గాయాలకు, దెబ్బలకు అరటిపండు తొక్క దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీర భాగంలో ఏదైనా ఒక భాగం నొప్పిగా అనిపిస్తే, అక్కడ అరటిపండు తొక్కతో కొంచెం సేపు మసాజ్ చేస్తే ఉపశమనం కలుగుతుంది.ఇలా ఎన్నో రకాలుగా చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి అరటి పండు, అరటి పండు తొక్క బాగా పనిచేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: