బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?
తాజాగా మలయాళంలో బిగ్ బాస్ సీజన్ 2 పూర్తిచేసుకుని సీజన్ 3 ను సోమవారం ఫిబ్రవరి 14 నుంచి ప్రసారం అవుతుంది. ఈ మలయాళ బిగ్ బాస్ రియాలిటీ షో కి వ్యాఖ్యాతగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వ్యవహరించనున్నారు. ఈ షోలో పాల్గొనే 14 మంది కంటెస్టెంట్ లను పదిహేను రోజులపాటు క్వారంటైన్ లో ఉంచి వారికి కరోనా పరీక్షలను నిర్వహించి, వారి రిపోర్ట్ నెగిటివ్ వచ్చిన తరువాత వారిని హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొనడానికి పంపించారు. వంద రోజుల పాటు ప్రసారం అయ్యే ఈ రియాలిటీ షో లో ఎవరు గెలుస్తారు, బిగ్ బాస్ టైటిల్ ను ఎవరు దక్కించుకుంటారు అనే ఆతృత మలయాళ ప్రేక్షకులలో మొదలైంది.
అయితే మిగతా సీజన్లలో కన్నా మూడవ సీజన్ లోని కంటెస్టెంట్ లు ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సీజన్ లో పాల్గొన్న ఆ 14 మంది కంటెస్టెంట్ లు ఎవరంటే..అదోని జాన్, అనూప్ కృష్ణన్, డింపల్ బల్, భాగ్యలక్ష్మీ, ఆర్జే ఫిరోజ్, మజీజియా భాను, లేక్ష్మీ జయన్, మణికుట్టన్, నోబి మార్కోస్, రంజాన్ ముహమ్మద్, సూర్య మీనన్, రీతూ మంత్ర, సాయి విష్ణు, సంధ్య మనోజ్ బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. అయితే ఈ రియాలిటీ షో కరోనా నిబంధనలను, జాగ్రత్తలను పాటిస్తూ నిర్వహిస్తున్నట్టు బిగ్ బాస్ నిర్వాహకులు తెలియజేశారు.