ఆ ఒక్క ఆకు వాడితే చాలు.. మీ జుట్టు సమస్యలు అన్నీ దూరం..!

Divya

ఇప్పటికే చాలామంది మార్కెట్లో దొరికే ఎన్నో రకాల కాస్మెటిక్స్, షాంపూలు, నూనెలు జుట్టు సంరక్షణ కోసం వాడి, ఎలాంటి ఫలితం రాక విసుగు చెంది ఉంటారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు ఒక ఆకు గురించి చెప్పబోతున్నాము . ఆ ఆకు యొక్క విశేషాలు ఏమిటంటే,ఎంతటి జుట్టు సమస్య అయినా ఇట్టే తగ్గిపోతుంది.ఆ ఆకు ఏంటి, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అది ఏదో కాదండీ.. గుంటగలగరాకు. ఈ ఆకు ని ప్రస్తుతం ఎన్నో హెయిర్ ఆయిల్ తయారీ సంస్థలు, వాటి నూనెల తయారీలో ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం షాంపూ లలో కూడా ఈ గుంటగలగరాకును ఉపయోగిస్తున్నారు. గుంటగలగర ఆకు ఎక్కడ చూసినా లభ్యమౌతుంది. ముఖ్యంగా పొలం గట్ల మీద, ఇంటి వెనక పెరట్లో మనం దీనిని చూడవచ్చు. గుంటగలగర ఆకు తో నూనె ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నూనె తయారీ కోసం గుంటగలగర ఆకులు ఒక కప్పు తీసుకోవాలి. వీటిని నూనె లో వేసి మరిగించాలి. కొబ్బరినూనె అయినా ఆముదం నూనె అయినా ఉపయోగించవచ్చు. ఆకులు నల్ల బడే వరకు నూనెలో మరిగించాలి. ఆ తరువాత నూనె ను వడకట్టుకోవాలి. చల్లారాక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఇలా తయారుచేసి పెట్టుకున్న నూనెను, మీరు వాడేటప్పుడు గోరువెచ్చగా చేసుకుని,కుదుళ్లకు,జుట్టుకు బాగా పట్టించి,మునివేళ్లతో ఐదు నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. అలా రెండు గంటల తర్వాత కుంకుడుకాయ రసం లేదా తక్కువ ఘాడత కలిగిన షాంపూతో తల స్నానం చేయవచ్చు.

ఇలా చేయడం వల్ల కుదుళ్ళు బలపడి,జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా చుండ్రు ను కూడా నివారించవచ్చు. ఈ నూనెను ముఖ్యం గా రాత్రి పడుకునే ముందు జుట్టుకు పట్టించి, ఉదయాన్నే స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక అలాగే గుంటగలగర ఆకులను ఎండబెట్టి, పొడి చేసుకొని, ఎప్పుడు కావాలంటే అప్పుడు, కొబ్బరి నూనెలో కొద్దిగా ఈ పొడి వేసి మరిగించుకోవచ్చు. అలాగే ఈ ఆకులను మెత్తగా నూరి, అందులో కొద్దిగా పెరుగు కలిపి  హెయిర్ ప్యాక్ వేయడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: