బొల్లి మచ్చలు వచ్చాయని బాధపడుతున్నారా..? అయితే మీకోసం ఒక చక్కని చిట్కా..

Divya

నేటి తరం యువత మంగు మచ్చల కారణంగా ఎలా బాధ పడుతున్నారో? అలాగే బొల్లి మచ్చలు కూడా వచ్చాయని చాలా భయపడుతున్నారు. కొంతమంది బొల్లి మచ్చలు రావడం వల్ల స్కిన్ క్యాన్సర్ వస్తుందేమో అన్న అపోహతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ బొల్లి మచ్చల వల్ల ఎలాంటి దురద,నొప్పి, మంట వంటి సమస్యలేమీ ఉండవు. కేవలం చర్మం మీద తెల్లని మచ్చలు,చూడటానికి అసహ్యంగా కనిపిస్తాయి. అయితే ఈ బొల్లి మచ్చల వల్ల ఆత్మన్యూనతా భావానికి లోనవుతుంటారు చాలామంది.
అయితే ముఖ్యంగా ఈ బొల్లి మచ్చలు ఎందుకు వస్తాయి అంటే,శరీరంలోని త్రిగుణాలు అయినా  వాత, పిత్త,కఫ దోషాల అసమతుల్యత వల్ల వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఈ బొల్లి మచ్చల కారణంగా మనం ఏదైనా విరుద్ధమైన ఆహారం తినడం,  విపరీతమైన ఆలోచనలు, అసమతుల్యత వల్ల కూడా ఈ బొల్లి మచ్చలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం ఆయుర్వేదంలో మంచి పరిష్కారాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా బొల్లి మచ్చల చికిత్సలో రోగి సహకారమే ఇందుకు ప్రధానాంశం.  ఈ జబ్బు తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇందుకు చేయవలసిందల్లా విరుద్ధమైన ఆహార పదార్థాలు తినడం మానుకోవాలి. ఇక అంతేకాకుండా మనం రోజూ తీసుకొనే పాలు, పెరుగు,చేపలు, ఉప్పు,చింతపండు, శెనగపిండి, నువ్వులు,బెల్లం ,గోంగూర, వంకాయలు ఇలాంటివి మితంగా తినడం మంచిది.
అయితే రోగి శరీర తత్వాన్ని, ఇతర ఆరోగ్య పరిస్థితులను,అలవాట్లను,జీవన విధానాలను దృష్టిలో ఉంచుకొని ఈ చికిత్సను నయం చేయడం ఉత్తమం.
వాత దోషం వల్ల ఏర్పడిన మచ్చలు గరుకుగాను, ఎర్రగానూ ఉంటాయి. అయితే కఫం వల్ల ఏర్పడే మచ్చలు తెల్లగా,పెద్దగా ఉంటాయి. కొత్తగా మొదలైన మచ్చలను తగ్గించడం చాలా సులువు. కానీ ఆలస్యంగా తగ్గుతాయి.
 ఒకవేళ మీ చర్మం ఎప్పుడైనా కాలి,తెల్ల మచ్చలు ఏర్పడితే,మందులతో నల్లబడడం ఏది జరగదు. కానీ అరచేతిలో, అరికాళ్ళలో, పెదాల మీద,గడ్డం పైన వచ్చే మచ్చలు ఆలస్యంగా తగ్గుతాయి . సాధారణంగా శరీరానికి ఎండ తగలడం వల్ల వచ్చే మచ్చలు తొందరగా తగ్గుతాయి
 ఇక బావంచాలు,బొల్లి మచ్చల మీద అమితమైన ప్రభావాన్ని చూపిస్తాయి. స్రోరలిన్స్ పేరుతో ఎంతో మంది ఆధునిక వైద్యులు కూడా ఈ బావంచాలలో  ఉన్న సారాన్ని గ్రహించి, ఔషధంగా వాడుతుంటారు.  మన మార్కెట్లో చూస్తున్న మేలనోసిల్, మానాడెర్మ్ వంటి ఔషధాలు ఈ జాతికి చెందినవి. అంతేకాకుండా సూర్యకాంతం, శారిబాదివటి, సోమరాజివటి, చంద్రప్రభావటి, మంచిష్టాది వంటి ఔషధాలు కూడా బొల్లి మచ్చలు చికిత్సలో వాడతారు. అయితే ఈ మందులు మచ్చల బట్టి తీసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: