ఇలా చేస్తే ఇక జన్మలో మీ జుట్టు రాలదట...

Divya

ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది జుట్టు అందం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల నూనెలను, ఎన్నో వేలు ఖర్చు పెట్టి మరీ తీసుకొని వాడుతుంటారు  . కానీ వాటివల్ల ప్రయోజనం ఎంత కలుగుతుందో తెలియదు కానీ, వేలకు వేలు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే అలాంటి వారు అంత డబ్బు ఖర్చు చేసి, ఎన్నో రకాల నూనెలను కొనడం బదులు,మన ఇంట్లో దొరికే కొన్ని పదార్థాల ద్వారా సహజంగా తయారు చేసుకొని వాడడం వల్ల జుట్టు రాలడాన్ని ఆపడమే కాకుండా,ఖర్చు కూడా తగ్గించిన వాళ్ళం అవుతాము. అయితే ఆ పదార్థాలేంటో ఆ చిట్కా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆనియన్ హెయిర్ ఆయిల్:
ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక ఈ రెమిడీని తయారు చేసుకోవడానికి ముందుగా పింక్ కలర్లో ఉండే ఉల్లిగడ్డలను తీసుకోవాలి. తెల్ల రంగులో ఉండే ఉల్లిగడ్డలను అస్సలు తీసుకోకూడదు. పెద్ద సైజు ఉల్లిగడ్డను ఒకటి తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి మెత్తగా పేస్టులా తయారు చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఆ స్టౌ మీద ఒక కడాయి పెట్టి, అందులో 50 నుంచి 100 గ్రాముల ఆవ నూనె లేదా కొబ్బరి నూనెను వేయాలి. ఇక ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ పేస్ట్ ను వేసి బాగా కలపాలి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ నూనె నూ తయారు చేయాలంటే తక్కువ మంటపైన తయారు చేయడం ఉత్తమం. అంతేకాకుండా నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డ మిశ్రమాన్ని వేయకూడదు. ఇక నూనెలో ఈ ఉల్లిగడ్డ మిశ్రమం బాగా కరిగేవరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఆన్ చేసి ఒక ఫిల్టర్ ద్వారా వడకట్టుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు  ఈ  నూనె ను జుట్టు కుదుళ్లకు పట్టించి, ఒక గంట ఆరిన తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

ఉల్లిగడ్డ లో ఉండే సల్ఫర్ జుట్టు రాలడాన్ని ఆపుతుంది. అంతేకాకుండా ఉల్లిగడ్డలో యాంటీ బాక్టీరియా లక్షణాలు ఎక్కువగా ఉండటం కారణంగా, జుట్టు రాలకుండా చేస్తుంది. అలాగే ఆవ నూనెతో కలిపి ఉల్లిగడ్డరసం రాయడం వల్ల మన తలపై ఉండే చర్మం యొక్క పీహెచ్ బ్యాలెన్స్ కూడా సమతుల్యం అవుతుంది.ఫలితంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టుకు సరైన రక్తప్రసరణ జరిగినప్పుడే జుట్టు వేగంగా పెరిగి, జుట్టు రాలడం ఆగిపోతుంది.

చూశారు కదా ఫ్రెండ్స్..!  పైన చెప్పిన రెమిడీ మీరూ పాటించి, జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: