ముఖానికి కేవలం ఈ రెండు కలిపి రాస్తే చాలు.. ఫేషియల్ గ్లో వస్తుందట..!

Divya

ప్రస్తుతకాలంలో ప్రతి అమ్మాయి తోపాటు అబ్బాయిలు కూడా తమ అందాన్ని రెట్టింపు చేసుకునే ప్రయత్నంలోనే, దాదాపు చాలా సమయాన్ని గడిపేస్తున్నారు అని ఒక అధ్యయనం ద్వారా తెలిసింది. అంతేకాకుండా వారి చర్మ రంగు ఎలా ఉన్నా సరే, ఎటువంటి మచ్చలు,ముడతలు, మొటిమలు లేకుండా కాంతివంతంగా,ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఇక ప్రస్తుతకాలంలో వాతావరణంలో వెలువడే కలుషిత కారణాల వల్ల కానీ, మనం తీసుకునే ఫుడ్ కారణాల వల్ల కానీ ఆ ప్రభావం ముఖం పై  చూపుతుంది. ఫలితంగా చిన్న వయసులోనే చర్మ సంబంధిత వ్యాధులు మొటిమలు, మచ్చలు,సన్ ట్యాన్ వల్ల చర్మం నల్లబడిపోవడం, వయస్సు మీద పడకుండానే  పిగ్మెంటేషన్ వంటి ఎన్నో సమస్యలతో బాధపడుతుంటారు.


అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటించి,ముఖం మీద ఉన్న ఎలాంటి మచ్చలు అయినా, మొటిమల అయినా,అన్ని రకాల మలినాలను తొలగించి, మీ ముఖాన్ని రెట్టింపు కాంతివంతంగా, ఆరోగ్యంగా తయారుచేసుకోవచ్చు. అయితే ఆ చిట్కాలేంటో?వాటిని ఎలా ఉపయోగించుకోవాలో? ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పుతోపాటు ఒక టేబుల్ స్పూన్ పంచదార పొడిని కలపాలి. ఇందులో ఒక అర చెక్క నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇక చివరగా ఇందులో ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ను కలపండి. వీటన్నిటినీ బాగా మిక్స్ చేసి, పేస్టు లాగా తయారు చేయాలి.

ముందుగా మీరు మీ ముఖంపై ఏ ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలనుకుంటున్నారో, ఆ ప్రదేశంలో కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేయాలి.  ఈ నూనె మన శరీరంలోకి ఇంకిపోయే వరకూ, కొద్ది సేపు మసాజ్ చేయాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా అప్లై చేసి, పదిహేను నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత పది నిమిషాలు ఈ ఫేస్ ప్యాక్ ను అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇక ఈ ప్యాక్ను వారానికి రెండుసార్లు వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ముఖం పై ఉన్న మొటిమలు, మచ్చలు,వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ను తొలగించి, చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: