రాత్రిపూట ఇది కలిపి రాయడం వల్ల జుట్టు పెరిగి, రెట్టింపవుతుంది.

Divya

చాలామందికి జుట్టు రాలే సమస్య తీవ్రంగా ఉంటుంది. చిన్న వయసులోనే బట్టతల రావడం,  ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రదేశంలో జుట్టు రాకపోవడం లాంటివి జరుగుతుంటాయి. జుట్టురాలే సమస్య కారణంగా త్వరగా బట్టతల వచ్చి చూడడానికి అందవిహీనంగా కనిపిస్తుంటారు. ప్రస్తుతకాలంలో మరీ ముఖ్యంగా 25 సంవత్సరాలు దాటితే చాలు..బట్టతల వచ్చేస్తోంది.  ఇలాంటి ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఒకటే దారి.  ఇప్పుడు చెప్పబోయే ఆ చిట్కాలు రాత్రిపూట ఉపయోగించి చూడండి. ఆ తర్వాత ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది.


జుట్టు పెరుగుదలకు మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయని మనకు తెలుసు. ఎప్పుడు? ఎలా? వాడాలో  మాత్రం చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ మెంతులను సరైన పద్ధతిలో వాడడం వల్ల జుట్టు అమాంతం పెరుగుతుంది. ఒక వెంట్రుక ఉన్నచోట 10 వెంట్రుకలు రావడం ఖాయం. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే. ముందుగా మీ జుట్టుకు సరిపడినంత రెండు లేదా మూడు స్పూన్ల మెంతులను ఒక బౌల్లోకి తీసుకొని, ఈ మెంతులు మునిగే వరకు నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టాలి.

ఉదయాన్నే స్టవ్ మీద ఈ మెంతుల నీటిని ఒక ఐదు నుంచి పది నిమిషాలపాటు బాగా మరిగించాలి. ఈ నీటిని బాగా చల్లారిన తర్వాత ఫిల్టర్ సహాయంతో నీటిని వడకట్టుకోవాలి. తర్వాత ఒక అర చెక్క నిమ్మకాయ తీసుకొని అందులో కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్ లో వేసుకొని భద్రపరుచుకోవచ్చు. లేదా ఒక కాటన్ బాల్ ని ఆ మిశ్రమంలో  అద్ది, స్కాల్ఫ్  మొత్తానికి పట్టించాలి.  అయితే తలలోని జుట్టుకు  నూనె లేనప్పుడు మాత్రమే ఉపయోగించడం మంచిది.

 ఇలా అప్లై చేసిన 45 నిమిషాల తర్వాత ఘాఢత తక్కువ కలిగిన షాంపూతో తలస్నానం చేయాలి. మెంతులలో ఫోలిక్యాసిడ్, విటమిన్ డి,విటమిన్ కె, పొటాషియం,కాల్షియం,ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. ఇక చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు నిమ్మ చెక్కను కలిపి రాయడం వల్ల చుండ్రు  తగ్గే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: