చలికాలంలో మీ జుట్టు బాగా దృఢంగా ఉండటానికి ఈ పద్ధతి పాటించండి....
అవిసె నూనె తయారీకి కావాల్సిన పదార్ధాలు...అవిసె గింజలు - నాలుగు కప్పులు,
నీరు - ఒక కప్పు,
ఏదైనా ఎస్సెన్షియల్ ఆయిల్,
ఒక బౌల్...
అవిసె నూనె తయారు చేయు విధానం...
ముందు రోజు రాత్రి ఒక బౌల్ లో అవిసె గింజలు వేసి, నీరు పోసి రాత్రంతా నానబెట్టండి. పొద్దున దీనిని సాస్ పాన్ లో వేసి మిశ్రమం చిక్కబడే వరకూ వేడి చేయండి.ఆ తరువాత ఇంకొక బౌల్ లోకి వడకట్టండి. మంచి పరిమళం కోసం మీకు నచ్చిన ఎస్సెన్షియల్ ఆయిల్ ని కొన్ని చుక్కలు కలపండి.ఈ జెల్ ని ఫ్రిజ్ లో, లేదా ఏదైనా చల్లని ప్రదేశం లో స్టోర్ చేసుకోండి. హెయిర్ వాష్ తరువాత దీనిని కండిషనర్ లాగా అప్లై చేయండి. కొంత సేపు అలా వదిలేసి ఆ తరువాత నీటితో శుభ్రంగా కడిగేయండి.మీది ఫ్రిజ్జీ హెయిర్ అయితే దీని వల్ల జుట్టుకి మంచి బలం, టెక్స్చర్ వస్తాయి.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో సౌందర్య చిట్కాల గురించి తెలుసుకోండి...