ఈ మాయిశ్చరైజింగ్ మిస్టేక్స్ చేస్తే అంతే సంగతులు

Naga Sai Ramya
ముఖాన్ని క్లీన్స్ చేసుకున్న వెంటనే మాయిశ్చరైజర్ ను వాడాలి. ముఖం తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ ను వాడకపోతే మాయిశ్చర్ ఎవాపరేట్ అయిపోయే అవకాశం ఉంది.

ఆయిలీ స్కిన్ కు మాయిశ్చరైజర్ అవసరం లేదనుకోవడం పొరపాటు. క్లీన్సింగ్ తరువాత ఆయిలీ స్కిన్ కు కూడా మాయిశ్చరైజర్ అవసరపడుతుంది.

కఠినమైన క్లీన్సర్స్ తో వాష్ చేసి మాయిశ్చరైజ్ చేయకపోతే స్కిన్ అనేది అధికంగా ఆయిల్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. కోల్పోయిన మాయిశ్చర్ ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తుంది. కాబట్టి, మరీ ఆయిలీగా ఫేస్ మారకముందే ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

మాయిశ్చరైజర్ అప్లై చేసేటప్పుడు స్కిన్ ను ఎంతో జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. ఏదోలా అప్లై చేసేస్తే ఫలితం ఉండదు. సున్నితంగా అప్లై చేయాలి. కఠినంగా ట్రీట్ చేస్తే స్కిన్ డేమేజ్ అవుతుంది అలాగే ముడతలు వచ్చే ప్రమాదం ఉంది. సర్కులర్ మోషన్ లో మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఫింగర్ టిప్స్ తో మృదువుగా స్కిన్ ను మసాజ్ చేయాలి.

చాలామంది మాయిశ్చరైజర్ ను అప్లై చేసేటప్పుడు మెడను ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. డైలీ మాయిశ్చరైజర్ ను నెక్ కు కూడా అప్లై చేయడం ముఖ్యం. లేదంటే, ఫేస్ స్మూత్ గా ఉన్నట్టు అనిపించినా నెక్ మాత్రం ఆకర్షణీయంగా ఉండదు.

మీరు కొన్నిసార్లు మాయిశ్చరైజర్ పనిచేయట్లేదేమోనన్న సందేహంలో ఉండవచ్చు.  మీ సందేహం నిజమే. కెమికల్స్ తో నిండిన మాయిశ్చరైజర్స్ పనిచేయకపోగా మీ స్కిన్ కు మరింత డేమేజ్ ను కలిగిస్తాయి. కాబట్టి, నేచురల్ ప్రోడక్ట్స్ నే ప్రిఫర్ చేయడం మంచిది. మీ స్కిన్ టైప్ కు తగిన ప్రోడక్ట్స్ ను ఎంచుకోవడం కూడా మంచిదే.

కొబ్బరి నూనె అనేది నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. డ్రై స్కిన్ ప్రాబ్లెమ్ ను సాల్వ్ చేస్తుంది కూడా. అలోవెరా కూడా నేచురల్ మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. కాబట్టి, నేచురల్ ప్రోడక్ట్స్ కు ఇంపార్టెంట్ ఇస్తే స్కిన్ హెల్త్ బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: