ఈ చిట్కాలతో మీ ముఖంపై రంధ్రాలు శాశ్వతంగా మాయం...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... చాలా మంది ముఖంపై రంధ్రాలతో చాలా బాధపడుతూ వుంటారు. అలాంటి వారు ఈ చిట్కాలని పాటించండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.రెండు టేబుల్ స్పూన్ల దోసకాయ రసంలో ఒక స్పూన్ నిమ్మరం కలపండి. ఆ రసాన్ని దూది(కాటన్ బాల్స్)తో ముఖానికి అద్దండి. అది బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.ముఖంపై ఉండే రంథ్రాలను దూరం చేయడానికి దోసకాయ బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సిలికా మీ చర్మానికి యవ్వనాన్ని అందించడమే కాకుండా పెద్ద రంథ్రాలను దగ్గరకు చేస్తాయి. వీటికి నిమ్మరసం చేర్చినట్లయితే మరింత మెరుగైన ఫలితాలను చూడవచ్చు. నిమ్మ కూడా గుంతలను మాయం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది.అరటి పండు తొక్కను ఎందుకు పనికిరాదని పడేయకండి. ఇది కూడా ముఖంపై రంథ్రాలను పూడ్చడంలో కీలకంగా పనిచేస్తుంది. ఎందుకంటే అరటి పండు తొక్కలో లుటీన్ ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ పోషణకు సహకరిస్తాయి.

అరటి తొక్కలో ఉండే పొటాషియం చర్మంపై మచ్చలను తొలగిస్తుంది.అరటి పండు తొక్కను మీ చర్మం మీద గుండ్రంగా రుద్దండి. ఇలా సుమారు 15 నిమిషాలు వరకు రుద్దండి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీన్ని వారంలో రెండుసార్లు చేస్తే చాలు. ముఖం మీద ఏర్పడిన పెద్ద రంథ్రాలు క్రమేనా మాయమవుతాయి.ముల్తానీ మట్టి కేవలం మొటిమలనే కాదు. చర్మం మీద ఏర్పడే రంథ్రాలను సైతం మాయం చేస్తుంది. ఇది చర్మం మీద ఉండే నూనెలను పీల్చుకుని పెద్ద రంథ్రాలు ఏర్పడకుండా కాపాడుతుంది. చర్మంలోని మృత కణాలను సైతం తొలగిస్తుంది. వారానికి ఒకసారి ముల్తాని మట్టి రాస్తే.. రంథ్రాలు బిగువుగా మారతాయి.ముల్తానీ మట్టిని మీ ముఖాన్నికి బాగా రాసుకోండి. అది ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.పసుపులోని సుగుణాలు గురించి మీకు తెలిసిందే. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు గల పసుపు గుంతల్లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఫలితంగా రంథ్రాలు చుట్టూ ఏర్పడే వాపు తగ్గుతుంది.

ఓట్స్ మంచి బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే కాదు. చర్మ సంరక్షణకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓట్స్ చర్మం మీద ఉండే ఆయిల్‌ను గ్రహిస్తుంది. అలాగే రంథ్రాలు, గుంతల పరిమాణాన్ని తగ్గిస్తుంది.రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్‌లో ఒక టేబుల్ స్పూన్ పాలు కలపండి. ఆ మిశ్రమాన్ని చర్మానికి రాయండి. బాగా ఆరిన తర్వాత మీ ముఖాన్ని కాసేపు రుద్దండి. అనంతరం చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.ఇక ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: