ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... అందంగా ఉండాలంటే ముఖం ఒక్కటే సౌందర్యంగా ఉంటే సరిపోదు. ముఖంతో పాటు అందమైన చిరునవ్వు కావాలి. అందమైన చిరునవ్వు కావాలంటే ఆరోగ్యవంతమైన పళ్ళు ఉండాలి. ఇక బలమైనా, ఆరోగ్యకరమైన పళ్ళకి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం, విటమిన్ సీ అన్నీ పసుపులో ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ. యాంటీ-బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఓరల్ ప్రాబ్లంస్ నించి రిలీఫ్ ని ఇస్తాయి. పసుపు తో డైరెక్ట్ గా అలాగే కానీ, లేదా ఇంకొన్ని పదార్ధాలు కలిపి కానీ వాడచ్చు.
నాలుగు టేబుల్ స్పూన్ల పసుపులో రెండు టీ స్పూన్ల బేకింగ్ సోడా, మూడు టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమం లో బ్రష్ ముంచి ఒకటి రెండు నిమిషాలు మృదువుగా బ్రష్ చేయండి. తరువాత కరిగించిన కొబ్బరి నూనె ని నోట్లో వేసుకుని ఒక నిమిషం పాటూ పుక్కిలించండి. ఇప్పుడు మౌత్ వాష్ చేసేసుకోండి. మొదటి వారం ఇలా చాలా సార్లు చేసి, తర్వాతా వారానికి ఒకటి, రెండు సార్లు చేయండి.అర గ్లాసు మంచి నీటిలో అర టీ స్పూన్ పసుపు వేసి కలపండి. ఈ మిశ్రమం తో ఒక నిమిషం పాటూ పుక్కిలించి ఉమ్మేయండి. ఆ తరువాత మామూలు నీటితో మౌత్ వాష్ చేసుకోండి. ఇలా రోజూ చేయవచ్చు.
పసుపు కొమ్ముని కొద్ది నిమిషాలు వేయించండి. ఇప్పుడు దాన్ని మెత్తగా పొడి చేయండి. అందులో నిమ్మ రసం, ఉప్పు కలపండి. ఈ పేస్ట్ ని పళ్ళ మీద అప్లై చేసి కొద్ది నిమిషాలు అలాగే వదిలేయండి. మౌత్ వాష్ చేసేయండి. వారంలో మూడు సార్లు ఇలా చేయండి. ఇలాంటి మరెన్నో బ్యూటీ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...