బియ్యం నీటి వల్ల మీ జుట్టుకి ఎన్ని ప్రయోజనాలో చూడండి...!!!!

Purushottham Vinay
ముఖం ఎంత అందంగా ఉండటం ముఖ్యమో జుట్టు కూడా అంత అందంగా ఆరోగ్యాంగా ఉండటం అంతే ముఖ్యం. ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో బియ్యపు నీరు వల్ల జుట్టుకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి...
బియ్యం నీటిలో విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల బియ్యం నీటిని జుట్టుకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు ఒత్తుగా, సిల్కీగా తయారవుతుంది. బియ్యం నీరు చుండ్రును కూడా తగ్గిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. బియ్యం నీటిలో పొటాషియం, అయోడిన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, మాంగనీస్ మరియు ఎక్కువ ఫైబర్ ఉంటాయి. అంతే కాదు బియ్యం నీటితో చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. బియ్యం నీరు ముఖ రంధ్రాలను తగ్గించి మీ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఈ బియ్యం నీటిని క్రమం తప్పకుండా వాడితే ప్రకాశవంతమైన, మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. మొటిమల నివారణకు కూడా బియ్యపు నీటిని వాడవచ్చు.
బియ్యం నీరు మీ తలని లోతుగా శుభ్రపరుస్తుంది. జిడ్డు లేకుండా చేస్తుంది. అంతే కాదు, పొడి, చిక్కు పడే జుట్టు ఉన్నవారికి ఇది గొప్ప కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది. ఇది స్ప్లిట్ ఎండ్స్ ను కూడా తగ్గిస్తుంది. బియ్యం నీరులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాకుండా సిల్కీగా కూడా చేస్తుంది. కాబట్టి జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఒక్క బియ్యం నీటితో అటు మీ చర్మాన్ని, ఇటు మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీ చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి బియ్యం నీటిని రెగ్యులర్ గా ఉపయోగించండి. ఇంకా ఇలాంటి బ్యూటీ టిప్స్ కి సంబంధించిన ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: