ఈ హెయిర్ స్టయిల్స్ ట్రై చేస్తే ఏ అమ్మాయి అయినా ఎంజల్ అంత అందంగా కనిపిస్తుంది.. మీరు ట్రై చేయండి....

Purushottham Vinay
చాలా మంది ఆడవాళ్ళకు జుట్టు అనేది అందం. ఇక ఆడవాళ్లు ఈ హెయిర్ స్టయిల్స్ ని ఫాలో అయితే ఏంజెల్ అంత అందంగా కనిపిస్తారు. ఇండియా హెరాల్డ్ ఈ ఆర్టికల్ లో అందిస్తున్న ఆ హెయిర్ స్టయిల్స్ ఏంటో ఓ సారి చూడండి...

హాఫ్ అప్ ఎండ్ హాఫ్ డౌన్...ఈ హాఫ్ అప్ ఎండ్ హాఫ్ డౌన్ హెయిర్ స్టైల్స్ అనేవి చాలామంది ఫ్యావెరెట్ హెయిర్ స్టైల్స్. ఇవి పాలిష్ లుక్ ను అందిస్తాయి. ఇవి ఎంతో సులభం కూడా. లేజీ హెయిర్ డేకు ఇవి ఎంతో పెర్ఫెక్ట్. హెయిర్ లెంత్ లేదా టెక్స్చర్ ఎలా ఉన్న సరే ఇవి బాగా సూట్ అవుతాయి. పెళ్ళికి సిద్ధమవుతున్న యువతులు ఈ హెయిర్ స్టయిల్ లో స్పెషల్ లుక్ లో కనిపించవచ్చు. ముందు నుంచి కొంత హెయిర్ ను లాగి ఆ తరువాత వెనుకవైపు బాబీ పిన్స్ ను వాడి పిన్ చేయాలి. ముత్యాల బాబీ పిన్స్ ను వాడితే లుక్ అదిరిపోతోంది.

సైడ్ స్వేప్ట్ కర్ల్స్....కర్లీ హెయిర్ ఉన్నవారికి ఈ హెయిర్ స్టైల్ ఎంతో బాగుంటుంది. శిరోజాలు ఒత్తుగా కనిపించేటటువంటి హెయిర్ స్టయిల్ కోసం మీరు ట్రై చేస్తున్నట్టయితే ఈ హెయిర్ స్టయిల్ అనేది సొల్యూషన్. హెయిర్ ను కర్లీ గా అలాగే లీవ్ చేసి ఉంచకుండా ఒక సైడ్ కు వాటిని తీసుకుని ఇన్స్టెంట్ గా సోఫిస్టికేటెడ్ ఎఫెక్ట్ ను క్రియేట్ చేయవచ్చు. నిజానికి, ఈ ప్రాసెస్ ఎంతో సులభం. మీ హెయిర్ స్టైల్ ను ఏ ఈవెంట్ కైనా ఈజీగా సిద్ధం చేసుకోవచ్చు. మెరిసే హెయిర్ క్లిప్ తో అలంకరించవచ్చు. లేదా యాక్ససరీస్ ఏమీ లేకుండా కూడా ఈ లుక్ ను బాగా క్యారీ చేయవచ్చు.

పోనీ....చాలామంది మహిళలు తమ హెయిర్ ను హై పోనీగా సెట్ చేసుకునేందుకు ఇష్టపడతారు. వాల్యూమినస్ పోనీటెయిల్ వల్ల మీ హెయిర్ అనేది బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. పెద్దగా కష్టపడవలసిన అవసరం లేకుండానే ఈ హెయిర్ స్టైల్ లెంత్, వాల్యూమ్ అలాగే స్టయిల్ ను యాడ్ చేస్తుంది. హీటింగ్ టూల్స్ అవసరం కూడా లేదు. ఎటువంటి ఎక్స్టెన్షన్స్ ను వాడాల్సిన పని లేదు. వాల్యూమ్ ను యాడ్ చేయాలంటే బ్యాక్ కోమ్బింగ్ టెక్నీక్ ను వాడాలి. కరక్ట్ బ్రష్ ను ఉపయోగించాలి. పెళ్ళికి షాపింగ్ చేసుకునే సమయంలో ఈ హెయిర్ స్టైల్ కంఫర్ట్ తో పాటు మంచి లుక్ ను కూడా అందిస్తుంది.

హైడ్రేటెడ్ గా ఉండండి. రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని తాగండి. దాంతో, హెయిర్ అనేది రూట్స్ నుంచి స్ట్రెంతెన్ అవుతుంది. హెయిర్ గ్రోత్ బూస్ట్ అవుతుంది. హైడ్రేషన్ వల్ల స్కిన్ కు బెనిఫిట్స్ లభిస్తాయి. అదే రకంగా హెయిర్ కు కూడా బోలెడన్ని బెనిఫిట్స్ లభిస్తాయి.

హెల్తీగా తినండి. మీ డైట్ లో గ్రీన్స్, ఎగ్స్, బెర్రీస్, అవొకాడోస్, ఫిష్, నట్స్ అలాగే సీడ్స్ ను తినండి. ఇవన్నీ హెయిర్ కు లోపలి నుంచి పోషణను అందిస్తాయి.

హెయిర్ అనేది ప్రతి నెలా పావు ఇంచు పెరుగుతుంది. హెయిర్ కట్ చేసినా చేయకపోయినా మీ హెయిర్ పెరుగుతుంది. స్కాల్ప్ కు రెగ్యులర్ గా ఆయిల్ ను పట్టించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: