జుట్టు రాలుతోందా... అయితే ఈ పద్ధతులు పాటించండి...

Purushottham Vinay

చాలా మందికి జుట్టు రాలిపోవడం చాలా పెద్ద సమస్య అవుతుంది. ఈ సమస్యకి చాలా మంది అనేక రకాల ట్రీట్మెంట్ లు తీసుకుంటారు కాని ఎన్ని ట్రీట్మెంట్ లు తీసుకున్న ఈ పద్ధతులు పాటించకపోతే ఎలాంటి లాభం లేదు. కాబట్టి ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో ఆ పద్ధతులు పాటించండి. ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడండి...


మంచి పోషకాహారం తీసుకోండి.....

జుట్టు ఒత్తుగా అందంగా ఉండాలంటే.. శరీరానికి పోషకాలు ఎంతో అవసరం. కాబట్టి.. శరీరానికి తగిన పోషకాలు అందుతున్నాయో లేదో గమనించండి. మాంసం, చేపలు, నట్స్, పచ్చని ఆకు కూరలు వంటి ఆహారాన్ని మీ రోజువారీ డైట్‌లో చేర్చుకోండి. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మీ జుట్టుకు కూడా భద్రత లభించవచ్చు.

ధూమపానం చేయకండి....

చెడు వ్యసనాలు ఆరోగ్యానికి చేటు. మీకు స్మోకింగ్ అలవాటు ఉన్నట్లయితే తప్పకుండా మానేయండి. పొగతాగేవారిలో జుట్టు కుదుళ్లలోని డీఎన్ఏను నాశనం చేసి జుట్టు ఎదగకుండా చేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి..
స్మోకింగ్‌‌కు దూరంగా ఉండి మీ జుట్టును రక్షించుకోండి.


 
బయటకు వెళ్లేటప్పుడు టోపీ తప్పనిసరిగా  పెట్టుకోండి....

చాలామంది క్యాప్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందని భావిస్తారు. కానీ, ఎండలోకి వెళ్లేప్పుడు టోపీ పెట్టుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే.. అది మీ జుట్టును యూవీ రేస్ నుంచి నుంచి రక్షిస్తాయి. యూవీ రేస్ కూడా నుంచి వెలువడే రేడియేషన్ కూడా జుట్టుకు హానికరమని పరిశోధనల్లో తేలింది. అవి తలలోని ప్రోటీన్లకు నష్టం కలిగిస్తాయి. దీనివల్ల జుట్టు త్వరగా ఊడిపోతుంది.



ముఖ్యంగా ఒత్తిడికి లోనవకుండా దూరం చేసుకోండి....

ఒత్తిడి వల్ల అనారోగ్యాలు త్వరగా దాడి చేస్తాయి. అంతేకాదు.. జుట్టు రాలడానికి కూడా ప్రధాన కారణం ఒత్తిడే. ఒత్తిడి వల్ల జుట్టు రాలడమే కాకుండా హెయిర్ గ్రోత్ సైకిల్‌కు ఆటంకంగా మారుతుంది. కాబట్టి, రోజు వ్యాయామం లేదా యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. కంటి నిండా నిద్రపోండి.


జుట్టుకు ఆ పరికారాలు మంచివి కాదు కాబట్టి వాడొద్దు....

హెయిర్ డ్రైయర్స్, స్ట్రైటనింగ్ వంటి పరికరాలు జుట్టుకు అస్సలు మంచివి కావు. వీటిని అతిగా వాడితే జుట్టు కుదుళ్లు నాశనమవుతాయి. జుట్టు పెరుగుదలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. అలాగే జుట్టను మరింత సన్నగా మారుస్తాయి. జుట్టుకు వేడిని అందించే ఈ పరికరాలను అప్పుడప్పుడు మాత్రమే వాడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: