ఐ బ్రోస్ అందంగా, ఒత్తుగా ఉండడానికి ఈ టిప్స్ పాటించండి....
కొబ్బరినూనె కండిషనర్ గా అలాగే మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది బ్లడ్ సర్కులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. ప్రతి రోజూ కొబ్బరినూనెను ఐబ్రోస్ పై అప్లై చేస్తే మంచి రిజల్ట్ స్ వస్తాయి. వారంలో ఒకటి రెండు సార్లు వాడినా రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి.
దూదిని తీసుకుని కొబ్బరినూనెలో ముంచి దాంతో ఐబ్రోస్ పై ఆయిల్ ను అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఫేస్ ను వాష్ చేసుకోవాలి.
ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఏ మరియు ఈ ఉంటాయి. ఇవి హెయిర్ గ్రోత్ కు హెల్ప్ చేస్తాయి. ఆలివ్ ఆయిల్ డ్రాప్స్ ను ఫింగర్ టిప్స్ పై పోసి జెంటిల్ గా ఐబ్రోస్ పై మసాజ్ చేయాలి. రెండు గంటల తరువాత వాష్ చేసుకోవాలి. ఇలా రోజులో ఒక్కసారి చేస్తే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి.
హెన్నాతో కూడా ఐబ్రోస్ ను హైలైట్ చేసుకోవచ్చు. కొంతమంది జెట్ బ్లాక్ కలర్ ను ప్రిఫర్ చేయకపోతే నేచురల్ బ్లాక్ షేడ్ కోసం హెన్నాను ప్రిఫర్ చేస్తారు. హెన్నా వల్ల ఐబ్రోస్ థిక్ గా కనిపిస్తాయి. ఈ రెమెడీ కోసం హెన్నాపౌడర్ తో పాటు కొంత నిమ్మరసం అవసరమవుతుంది. 10 నుంచి 15 రోజులవరకు దట్టమైన ఐబ్రో లుక్ ను అందించేందుకు ఈ రెండు పదార్థాలు హెల్ప్ చేస్తాయి. ఆ తరువాత మీరు మళ్ళీ ప్రాసెస్ ను రిపీట్ చేయాలి. రెండు టీస్పూన్స్ హెన్నాను ఒక బౌల్ లో కలపాలి. ఆ తరువాత కొన్ని చుక్కల నిమ్మరసాన్ని మిక్స్ చేయాలి. పేస్ట్ ను తయారుచేయాలి. ఐబ్రోస్ పై అప్లై చేయాలి. నలభై నిమిషాల తరువాత వాష్ చేయాలి. హెన్నా స్కిన్ పై మరకలు కలిగించకుండా ఉండాలంటే ఐబ్రో ఏరియా చుట్టూ టేప్ తో కవర్ చేయండి. ఐ బ్రోస్ పేస్ట్ ను