ఈ పద్ధతులు పాటిస్తే కచ్చితంగా పొడవైన, నాజూకైన జుట్టు మీ సొంతం అవుతుంది...
మనిషి అందంగా ఉండాలంటే ముఖం బాగుంటే సరిపోదు. జుట్టు కూడా బాగుండాలి. చాలా మందికి అనేక జుట్టు సమస్యలు ఉంటాయి. హెయిర్ ఫాల్ అని, డ్యాన్ డ్రఫ్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యలకి శాశ్వతంగా స్వస్తి పలకడానికి ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ పద్ధతులు కచ్చితంగా పాటించండి. తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారు.
ఉసిరి నూనెతో తలకి మసాజ్ చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు వున్నాయి. ఉసిరిలో విటమిన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్, ఫైటో న్యూట్రియెంట్స్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. ఇవి స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యూలేషన్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. బ్లడ్ సర్క్యూలేషన్ ఇంప్రూవ్ ఐతే జుట్టు కుదుళ్లకు తగినంత ఆక్సీజన్ తో పాటు పోషణ లభిస్తుంది. దాంతో, హెయిర్ ఫాల్ సమస్యకు ఎండ్ కార్డు పడినట్టే. ఈ ఉసిరి నూనెను సులభంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా కొబ్బరి నూనెను వేడి చేయాలి. అందులో కాస్తంత ఆమ్లా పౌడర్ ను యాడ్ చేయాలి. బ్రౌన్ కలర్ లోకి మారేవరకు వేచి చూడాలి. ఈ ఆయిల్ కాస్తంత చల్లారాక, ఇప్పుడు ఈ ఆయిల్ ను స్కాల్ప్ పై అప్లై చేయాలి. జుట్టు కుదుళ్ళనుంచి అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి.
ఉసిరి కాయను తినడం వల్ల కూడా హెయిర్ కేర్ బెనిఫిట్ లభిస్తుంది. లేదంటే, జ్యూస్ ఫార్మ్‌తో తాగినా కూడా మంచిదే. ఆమ్లా జ్యూస్ త్రాగితే జుట్టు ఊడిపోకుండా దృడంగా ఉంటుంది. ఆమ్లా జ్యూస్ తయారీకి మీరు ఉసిరికాయలను తీసుకుని దాన్నుంచి రసం తీయండి. బ్లెండర్ సాయంతో ఆమ్లా నుంచి రసం తీయవచ్చు. ఇక్కడ ఒక ఆమ్లా అయితే సరిపోతుంది. అందులోకి తాజా నిమ్మరసాన్ని కలపండి. ఈ రెండిటినీ బాగా కలపండి. హెయిర్ టానిక్ సిద్ధమైపోయింది.
కరివేపాకులో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ స్కాల్ప్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. హెయిర్ ఫాల్‌ని తగ్గిస్తాయి. ఆమ్లాను కరివేపాకుతో కలిపితే ప్రయోజనం రెట్టింపు అవుతుంది. ఇందుకోసం మీరు పావు కప్పు తరిగిన ఉసిరికాయను తీసుకోవాలి. అలాగే పావు కప్పు కరివేపాకును తీసుకోవాలి. కప్పు కొబ్బరినూనె కూడా అవసరమే. ప్యాన్ వేడి చేసి అందులో కొబ్బరినూనె పోసి, దాన్లో కరివేపాకును అలాగే తరిగిన ఆమ్లాను కలపాలి. ప్యాన్ లోని పదార్థాలు బ్రౌన్ కలర్ లోకి వచ్చేవరకు చూసి ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. నూనెని ఒక గ్లాస్ జార్ లోకి వడగట్టాలి.
నూనె వెచ్చగా ఉన్నప్పుడే స్కాల్ప్ పై అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల పాటు స్కాల్ప్‌ని మసాజ్ చేయాలి. తలంతటికీ నూనె బాగా పట్టించాక ముప్పై నిమిషాల పాటు తలపై ఈ ఆయిల్ మాస్క్ ను అలాగే వదిలేయాలి. ఆ తరువాత హెయిర్ ను సల్ఫేట్ ఫ్రీ షాంపూతో వాష్ చేయాలి. చల్లటి లేదా వెచ్చటి నీళ్లను హెయిర్ వాష్ కు ఉపయోగించవచ్చు.