అందం: చర్మంపై నల్ల మచ్చలు తగ్గించే ఎఫెక్టివ్ టిప్స్!!
ముఖం అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే.. చర్మంపై ఎలాంటి మచ్చలు, మొటిమలు ఉండకుండా చూసుకోవాలి. అయితే మొటిమలను ఎలాగోలా తగ్గించుకోవచ్చు కానీ, డార్క్ ప్యాచ్(నల్ల మచ్చ)లను తగ్గించుకోవడం కాస్త కష్టంగా ఉంటాయి. ఇవి ఒక్కసారి వచ్చాయంటే.. అంత తొందరగా పోవు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ టిప్స్ పాటిస్తే.. డార్క్ ప్యాచ్ లు సులువుగా తగ్గించుకోవచ్చు. మరి అవేంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
నిమ్మరసంలో విటమిన్ సితో పాటు యాంటీఆక్సిడెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంపై నల్ల మచ్చలను తగ్గించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది. కనుక, నిమ్మరసం తీసుకుని మచ్చలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. పావు గంట పాటు ఆరనిచ్చి.. అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మచ్చలు ఉన్న ప్రాంతంలో రాత్రి పడుకునే సమయంలో వెల్లుల్లిని చిదిమి రాయాలి. ఉదయం లేవగానే చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల డార్క్ ప్యాచ్‌లు తగ్గుముఖం పడతాయి.
ఇక ఎటువంటి చర్మ సమస్యలైనా సరే, వాటిని తగ్గించడంలో దాల్చిన చెక్క ఖచ్చితంగా సహాయపడుతుంది. నల్ల మచ్చలను తగ్గించడంలోనూ దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి.. మచ్చలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. పావు గంట పాటు ఆరనిచ్చి.. అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ముఖంపై ఏర్పడ్డ నల్ల మచ్చలను నివారించడానికి బొప్పాయి గ్రేట్ గా సహాయపడుతుంది. కనుక, బొప్పాయి గుజ్జులోకొద్దిగా తేనె మిక్స్ చేసి.. మచ్చలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. అర గంట పాటు ఆరనిచ్చి.. అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకుంటే మచ్చలు తగ్గుముఖం పడతాయి.