'గ్రీన్ టీ'తో జిడ్డు చర్మానికి చెక్!
గ్రీన్ టీ మనకు ఎంత సహాయం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలి అంటే వెయిట్ లాస్ కి ఇది ఒక మంచి ట్రీట్మెంట్. మరి అలాంటి గ్రీన్ టీతో జిడ్డు చర్మానికి ఇలా చెక్ పెట్టచ్చు. మరి అలాంటి జిడ్డు చర్మానికి గ్రీన్ టీ తో ఏం చేస్తే జిడ్డు చర్మానికి చెక్ పెట్టచ్చు అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
టేబుల్ స్పూన్ సెనగపిండి, అరచెంచా తేనె, కొద్దిగా పాలలో చిటికెడు పసుపు కలిపి ముఖం, మెడ, చేతులకు పూతలా వేసుకోవాలి. అలా వేసుకున్న పదినిమిషాల తర్వాత ముఖం కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల మృతకణాలు తొలగి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
చర్మం పొడిబారినప్పుడు నాలుగు బాదం గింజల్ని రాత్రి అంత నానబెట్టి మెత్తగా చేయాలి. దానిలో పాలు, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరనివ్వాలి. దీని ద్వారా కళ్లకింద రాసుకున్నా నల్లటి వలయాలు మాయం అవుతాయి.
వేడినీళ్లలో గ్రీన్‌టీ బ్యాగ్ ని వేసి ఆ బ్యాగుని బయటకు తీసి ఆ గ్రీన్‌టీ మిశ్రమంలో అరచెక్క నిమ్మరసం కలిపితే సరి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మగ్రంథుల లోపలికి చొచ్చుకుని పోయి శుభ్రపడుతుంది.
ఇంకా గ్రీన్ టీ బ్యాగ్ లో చెంచా తేనె చేర్చితే జిడ్డుతొలగి కాంతివంతంగా మారుతుంది.
చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి ఆరోగ్యంగా, అందంగా తయారవ్వండి.