అందం: కాఫీ పౌడర్‌తో తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోండిలా..!!

Kavya Nekkanti

వెంట్రుకలు ఆరోగ్యంగా, నల్లగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కురులు వత్తుగా నల్లగా ఉంటే మంచి ఆరోగ్యంగా కూడా ఉన్నట్లే. కానీ, నేటి కాలంలో న‌ల్ల జుట్టు కాస్త తెల్ల‌గా మారి.. ఎంద‌రినో ఇబ్బందులు ప‌డేలా చేస్తుంది. నల్లటి జుట్టులో క‌నీసం ఒక్క తెల్ల వెంట్రుక వచ్చినా.. చాలా మంది కంగారు పడుతుంటారు. ఎందుకంటే తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సంకేతం. సహజంగా వయసు పెరిగేకొద్దీ జుట్టు తెల్లబడుతుంది. కాని, ఇటీవ‌ల వ‌య‌సుతో సంబంధం లేకుండా.. అతి పిన్న వ‌య‌సులోనే కొంద‌రి జుట్టు తెల్ల‌గా మారుతుంటుంది. ఈ సమస్యతొ చాలా మంది యువత బాధపడుతున్నారు. 

 

అయితే తెల్ల జుట్టు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా విటమిన్లు లోపించడం, ఆహారంలో మార్పు రావడంతో పాటు ఒత్తిడి పెరగడం, వీటితో పాటు వంశ పారంపర్యం కూడా కారణంగా చెబుతున్నారు నిపుణులు. అలాగే పెరిగిన పొల్యూషన్ కారణంగా జుట్టు సమస్యలు ఎక్కువవుతాయి. ఈ క్ర‌మంలోనే తెల్ల జుట్టు నుంచి విముక్తిని పొందేందుకు హెన్నాలని, హెయిర్ కలర్‌లని, ట్రీట్‌ మెంట్స్ అని వేలకు వేలు ఖ‌ర్చుచేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ శాశ్వ‌త ప‌రిష్కారం దొర‌క్క నిరాశ చెందుతుంటారు.

 

ఈ సమస్యకు కొన్ని ఇంటి చిట్కాలు చక్కని పరిష్కారం చూపిస్తుందని చెబుతున్నారు నిపుణులు.  ఇందులో భాగంగా తెల్ల జుట్టును కాఫీ పౌడ‌ర్‌తో కూడా చెక్ పెట్ట‌వ‌చ్చు. ఇందుకోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడిని కప్పు నీటిలో మరిగించాలి. చల్లారక దాన్ని స్ప్రే బాటిళ్లో నింపి జట్టుపై, కుదుళ్లపై చల్లాలి. తర్వాత మసాజ్ చేసుకొని గంటపాటు షవర క్యాప్ తగిలించుకోవాలి. కాఫీ మరకలు దుస్తులపై పడకుండా జాగ్రత్త వహించాలి. ఇక జుట్టు ఆరిన తర్వాత త‌ల‌స్నానం చేస్తే మీ జుట్టు నల్లగా మారుతుంది. అంతే ఈ సింపుల్ టిప్‌ను మీరూ యూజ్ చేసి మంచి ఫ‌లితాన్ని పొందండి.

  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: