వేలితో కొబ్బరినూనెను తీసుకుని పెదాలకు మసాజ్ చేస్తే మృదువుగా మారతాయి. తేనెతో పెదాలకు మసాజ్ చేస్తే పొడిబారిన పెదాలు, పగిలిపోయిన పెదాలు తిరిగి స్మూత్ గా తయారవుతాయి. పాలలో నిమ్మరసం కలిపి మెడకు రాసి అరగంట ఉంచితే, మెడ నలుపు తగ్గుతుంది. కొబ్బరినూనె మూడు స్పూన్లు, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ గ్లిజరిన్లకు రెండు టీ స్పూన్ల నీళ్లు కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక, ముఖానికి రాసి మసాజ్ చేసి అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ఆయిల్ ప్యాక్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. మూడు నెలలకోసారి వెంట్రుకల చివర్లను కత్తిరిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: