ఏడు రంగుల ఇంధ్రధనస్సు అందాన్ని వర్ణించలేము. అలాగే, ప్రకృతిలో మనకు లభించే కూరగాయలు, పండ్లు అన్నీ మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేవి. అయితే, ఒక్కో రంగుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలు, పండ్లతో మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కంటిచూపును కాపాడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. క్యాన్సర్ ను అడ్డుకుంటాయి. తెల్లరంగు కూరగాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. హార్మోన్ల అసమతుల్యతను నివారిస్తాయి. ఎర్రటి రంగులో ఉండే పండ్లు,కూరగాయలు వ్యర్ధాలను శరీరం నుంచి వెలుపలకు పంపిస్తాయి. కీళ్లకు బలాన్ని ఇస్తాయి. పసుపు రంగు పండ్లు దీర్ఘకాలం యవ్వనంగా ఉండేందుకు దోహదం చేస్తాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: