చుండ్రు సమస్య సర్వసాధారణంగా మారింది. వర్షాకాలంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు ఎన్ని షాంపూలు వాడినా ప్రయోజనం లేకపోతే, ఈ చిట్కాలను పాటించి చూడండి.... మెంతులు రెండు స్పూన్ల మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం మెత్తగా నూరాలి. ఆ ముద్దను మాడుకు పట్టించి అరగంట తర్వాత కుంకుడురసంతో తలస్నానం చేయాలి. నిమ్మరసం కుంకుడు, శీకాయ, షాంపూ.. దేనితో తలస్నానం చేసినా ఆఖరి చెంబు నీళ్లలో ఒక చెక్క నిమ్మకాయను పిండి ఆ నీటిని తలమీద పోసుకోవాలి. పుల్లటి పెరుగు బాగా పులిసిన పెరుగును తలకు రాసుకుని అరగంట ఉంచాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చుండ్రు నుంచి విముక్తి కావచ్చు.
మరింత సమాచారం తెలుసుకోండి: