ఏపని చేస్తున్నా, ఎక్కడకు వెళ్లినా నలుగురికి కనిపించేవి చేతులు, పాదాలు అవి అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే చూపరులను ఆకుట్టుకోవాలంటే!
రక్తం ప్రసరణ సాఫీగా జరిగితే ఆరోగ్యంగా ఉంటాయి. అందుకు మానిక్యూర్చ పెడి క్యూర్లను నెలకు రెండుసార్లు చెయించుకోవాలి. తగనంత శ్రద్ద తీసుకోవాలి. ఎక్కువ పనులు చేసేవారి చేతులు మృదుత్వన్ని కోల్పోతాయి.
అందుకని పాదాలకకు, చేతులకు తగిన రక్షణ చేయాలి. పాదాలు, చేతులు మెత్తగా వుండాలంటే శుభ్రంగా కడిగి, పొడి బట్టతో తుడిచి టీ ట్రీ ఆయిల్ ను మసాజ్ చేయాలి. నీళ్లతో పనిచేసినపుడు పని అయిన వెంటనే వాజ్ లైన్ కాని, కొబ్బరినూనె కానీ రాసి మసాజ్ చేయాలి.
గోరువెచ్చని నీటిలో లైట్ గా వుండే షాంపూ, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి పాదాలు వుంచాలి ఒక అరగంట అలా ఉంచిపాత టూత్ బ్రష్ తోరుద్దాలి. ఇలా పదిహేను రోజులకు ఒకసారి చేయడంవల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి మృతచర్మం తొలిగిపోతుంది. రాత్రి పడుకునేముందు చేతులకు పాదాలకు క్రీము రాయాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: