LIC నుంచి సరికొత్త పాలసీ.. సూపర్ రాబడి..?

Purushottham Vinay
ఇండియాలో ఎల్ఐసీను జనాలు ఎంతగానో ఆదరిస్తారు. ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు పోటీలో ఉన్నా కూడా ఎల్ఐసీ తన మార్క్ నమ్మకంతో కస్టమర్లను ఎంతగానో విపరీతంగా ఆకట్టుకుంటుంది.LIC ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్‌ను తీసుకువస్తూ వినియోదారుల నుంచి ఎన్నో మనన్నలు అందుకుంటుంది. ఇప్పుడు ఎల్ఐసీ మరో కొత్త ప్లాన్ ని తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా హామీ ఇచ్చిన రాబడితో పాటు అదనపు బోనస్‌లు కూడా వినియోగదారులకు వస్తాయి. అయితే ఈ బోనస్‌లు మాత్రం ఏ సంవత్సారానికి ఆ సంవత్సరం అని చెబుతుంటారు. అలాగే పాలసీ వ్యవధి కూడా 12 నుంచి 35 సంవత్సరాల దాకా ఉంటుంది. అయితే ఈ పాలసీను కనీస హామీ మొత్తం రూ.లక్షతో ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే దీనికి గరిష్ట హామీ మొత్తం మాత్రం లేదు. ఎంతైనా కూడా ఇందులో మనం పెట్టుబడి పెట్టవచ్చు. పాలసీదారు పరిమిత లేదా సాధారణ ప్రీమియం చెల్లింపుల మోడ్‌లను ఇందులో ఎంచుకోవచ్చు.ఇంకా అలాగే ఆదాయపు పన్ను మినాహాయింపులను కూడా lic వినియోగదారుల పొందుతారు. అలాగే ప్రతి సంవత్సరం కస్టమర్లకు వచ్చే బోనస్‌లను పాలసీ వ్యవధిలో జమ చేస్తారు. అదనంగా పాలసీదారు మెచ్యూరిటీ దాకా పాలసీ కొనసాగిస్తే టెర్మినల్ బోనస్‌ను lic కంపెనీ అందిస్తుంది.


 ఈ ఎల్ఐసీ ఎండోమెంట్ పాలసీ 8 నుంచి 50 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వారు తీసుకోవచ్చు.అయితే పాలసీదారుడికి మెచ్యూరిటీ సమయానికి గరిష్టంగా 75 సంవత్సరాలు ఉండాలి.ఇంకా ఈ పాలసీను భారతీయులతో పాటు భారతీయ మూలం ఉన్న విదేశీయులు కూడా తీసుకోవచ్చట. దరఖాస్తు ఫారమ్‌తో పాటు వయస్సు నిర్ధారణ పత్రం, చిరునామా ఇంకా అలాగే గుర్తింపు రుజువును ఇందుకు సమర్పించాల్సి ఉంటుంది.ఇక ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ రెండు పద్ధతుల్లో వినియోగదారులు ఈ పాలసీని పొందవచ్చు. ఎల్ఐసీ వెబ్‌సైట్‌లో బై పాలసీ ఆన్‌లైన్ ట్యాబ్‌ను క్లిక్ చేసి ఈ పాలసీ ఎంచుకుని పొందవచ్చు. మార్కెట్ నిపుణుల సూచన ప్రకారం ఎల్ఐసీలో ఎక్కువ మొత్తం రాబడి పొందాలంటే కనీసం 20 ఏళ్ల పాలసీ వ్యవధి అనేది ఉండేలా చేసుకోవాలి. ఇక ఓ వినియోగదారుడు రూ.10 లక్షల పాలసీ తీసుకున్నాడనుకుంటే ఎల్ఐసీ అందించే బోనస్‌లు 4 శాతం దాకా వస్తాయని అంచనా వేసుకోవాలి. వాటితో పాటు టెర్మినల్ బోనస్ రూ.1.5 లక్షల దాకా వినియోగదారుడు పొందుతాడు. అంటే దాదాపు రూ.17.2 లక్షలు సొమ్ము మెచ్యూరిటీ తరువాత కస్టమర్ చేతికి అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: