కుప్పకూలిన స్టాక్ మార్కెట్స్..!

Suma Kallamadi
దేశీయ స్టాక్ మార్కెట్ లో పది రోజుల వరుస లాభాలకి నేడు భారీ చెక్ పడింది. నేడు భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిసాయి. నేడు ఉదయం మార్కెట్ మొదలైన సమయంలో కాస్త పాజిటివ్ గానే ఉన్న సూచీలు ప్రపంచ మార్కెట్ల బలహీనత కారణంగా, ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. దీంతో ఈ నెలలో మొట్ట మొదటి సారి మార్కెట్ నష్టపోయింది. కేవలం మెటల్ రంగం సంబంధించి షేర్లు లాభపడగా మిగితా అన్నిరకాల పేర్లు నష్టాల బాట పట్టాయి. దీంతో 40 వేలకు పైకి వెళ్లిన సెన్సెక్స్ మరోసారి 40 వేల దిగువకు వచ్చింది. ఇక నేడు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1066 పాయింట్ల నష్టపోయి 39728 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 291 పాయింట్లు నష్టపోయి 11680 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇక నేడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 లో అత్యధికంగా లాభనష్టాలు పొందిన కంపెనీ షేర్ల విషయానికి వస్తే ముందుగా అత్యధికంగా లాభపడిన వాటిలో ఏషియన్ పెయింట్స్, జెఎస్డబ్ల్యు స్టీల్, హీరో మోటార్ కార్ప్, కోల్ ఇండియా కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. ఇందులో అత్యధికంగా ఏషియన్ పెయింట్స్ 0.92 శాతం లాభాలతో ముగిసింది. నష్టాల విషయానికొస్తే అత్యధికంగా బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, యిందుస్ లాండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంకు లో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందుగా ఉన్నాయి. ఇందులో బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా 4.6 శాతం నష్టపోయింది.

ఇక నేడు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరల విషయానికొస్తే.. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు చూసే 40 రూపాయలు నష్టపోయి రూ. 52 750 వద్ద ముగియగా, మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు కేవలం 10 రూపాయలు నష్టపోయి రూ. 48 350 వద్ద ముగిసింది. ఇక బంగారం తో పోటీగా వెండి ధర కూడా తగ్గింది. కేజీ వెండి ధర ఏకంగా వెయ్యి రూపాయలు నష్టపోయి 61 వేలకు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: