తెలంగాణ ప్ర‌భుత్వానికి మంచు ల‌క్ష్మీలేఖ.. ఎందుకంటే..?

N ANJANEYULU
సినీన‌టి మంచుల‌క్ష్మీ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అమ‌లు అవుతున్న మ‌న ఊరు-మ‌న‌బ‌డి ప్రోగ్రామ్ చాలా బాగుంద‌ని ప్ర‌శంసించిన‌ది. అయితే డిజిట‌ల్ ఎడ్యూకేష‌న్ లో భాగంగా ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ ట్రైన‌ర్ల‌తో విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇప్పిస్తే.. మెరుగైన ఫ‌లితాలుంటాయ‌ని సూచించింది. ఆ దిశ‌గా ప్ర‌భుత్వం దృష్టి సారించాల‌ని రిక్వెస్ట్ కూడా చేసింది. తాను కూడా ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌ని చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు స్ప‌ష్టం చేసింది.
ఇటీవ‌ల కాలంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు తెలంగాణ ప‌థ‌కాల‌ను ప్ర‌శంసిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌ను ప్ర‌శంసిస్తున్నారు. ఇటీవ‌ల టెస్లా సీఈఓ ఎలాన్ మాస్క్‌ను కేసీఆర్ తెలంగాణ‌కు ఆహ్వానించ‌డంపై విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నిఖిల్ వంటి వారు కేటీఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. తెలంగాణ‌లో టికెట్ల రేట్ల‌ను కూడా పెంచ‌డంపై అప్ప‌ట్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇండ‌స్ట్రీ పెద్దలు స్వాగ‌తించారు.  తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న  నిర్ణ‌యాన్ని కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: