క్లింటన్ కు ఏమైంది ?

క్లింటన్ కు ఏమైంది ?
బిల్ క్లింట్లన్ గుర్తున్నారా ?... అమెరికా మాజీ ఆధ్యక్షుడు. హైదరాబాద్ నగరాన్ని సందర్శించిన అమెరికా అధ్యక్షుడు కూడా. అప్పటి సత్యం సంస్థ అధినేత రామలింగ రాజు, నాటి అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరస కూర్చోని తెలుగు ప్రజలకు వరాల జల్లు కురిపించిన వ్యక్తి. తెలుగు వారితో నేరుగా సంభాషించిన తొలి అమెరికా అధ్యక్షుడు.  ఆయన భార్య హిలరీ  క్లింటన్ కూడా తెలుగు వారికి పరిచయస్తు రాలే.  అధ్యక్ష పదవి నుంచి దిగిపొయిన తరువాత  కూడా ఆయన భారత దేశంలో పర్యటించారు. ఆయన భార్య హిలరీ కూడా అడపా దడపా భారత్ సందర్శనకు వస్తున్న వ్యక్తే..
తాజాగా ఆయన అస్వస్థతకు గురైనట్లు అమెరికా ప్రసారమాధ్యమాలు బ్రెకింగ్ న్యూస్ లు ప్రాచారం చేస్తున్నాయి. ఆయనను దక్షిణ కాలిపోర్నియా ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. రక్తంలో ఇన్ ఫెక్షన్ కారణంగా ఆయన తీవ్ర అస్వస్థులైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు కోవిడ్ లేదని వారు స్పష్టం చేశారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు సేవలందించారు. మూడో సారి ఆ పదవిని చేపట్టేందుకు అక్కడి చట్టాలు అనుమతించవు. దీంతో ఆయన ఆ పదవికి దూరం కావలసి వచ్చింది. 1993 లోను, 2001 లోనూ ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. 2004 లో క్లింటన్ కు నాలుగు సార్లు బైపాస్ సర్జరీ చేశారు. శ్వాస ఎదుర్కోవడంలో ఇబ్బంది ఎదురవడంతో వైద్యులు ఈ చికిత్సలు చేశారు. 2005లో ఆయనకు ఊపిరి తిత్తులను మార్చారు. 2010 లో రెండు మార్లు శస్త్ర చికిత్సలు చేసి గుండెకు స్టంట్ లు అమర్చారు. తరువాత కొంత కాలం ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన భార్య హిలరీ క్లింటన్ ఎన్నికలలో పోటీ చేయడంతో ఆమె కు మద్దతుగా డెమోక్రాట్ల తరపున ప్రచారం చేశారు. ప్రస్తుతం క్లింటనే కాలిఫోర్నియా ఆసుపత్రిలో కోమాలో ఉన్నట్లు కూడా అమెరికా ప్రసారమాధ్యమాలు ప్రకటిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష భవనం మాత్రం మాజీ అధ్యక్షుడి ఆరోగ్యం పై ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: