తీన్మార్ మల్లన్న మళ్లీ అరెస్టు

Chaganti
తెలంగాణ ప్రాంతానికి చెందిన జర్నలిస్ట్ తీన్మార్‌ మల్లన్నకు పోలీసులు మళ్లీ షాకిచ్చారు, ఒక జ్యోతిష్యుడిని బ్లాక్‌మెయిల్ చేసిన కేసులో కొద్దిరోజులుగా జైల్లో ఉన్న ఆయనకు ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే బెయిల్‌పై ఆయన ఈరోజు విడుదల కాగానే నిజామాబాద్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా జానకంపేటకు చెందిన కల్లు అమ్మకమ్ దారుడయిన జయవర్ధన్‌ గౌడ్‌ను డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించినందుకు తీన్మార్ మల్లన్న సహా ఐదుగురిపై గతంలో పోలీసులు కేసు నమోదు చేశార, జయవర్ధన్‌గౌడ్‌ను అదే గ్రామానికి చెందిన సంతోష్‌, రాధాకిషన్‌గౌడ్‌, సాయాగౌడ్‌, రాజుగౌడ్‌ అనే వ్యక్తులు డబ్బులు ఇవ్వాలంటూ చింతపండు నవీన్‌ / తీన్మార్‌ మల్లన్నతో కలిసి కొన్ని రోజుల కిందట బెదిరించగా జయవర్ధన్‌గౌడ్‌ భయపడి ఆగస్టు నెలలో రూ.5 లక్షలు ఇచ్చారు. అయితే తీన్మార్‌ మల్లన్న పాదయాత్ర చేస్తున్నాడని ఖర్చుల కోసం మరో రూ.15 లక్షలు ఇవ్వాలని వారు జయవర్థన్‌ గౌడ్‌ను మళ్లీ డిమాండ్ చేయడంతో బాధితుడు ఆ ఐదుగురిపై బోధన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా తీన్మార్ మల్లన్న సహా మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే మల్లన్నని అరెస్ట్ చేసి నిజామాబాద్ తీసుకెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: