తెల్లని ఫేస్ కోసం సూపర్ టిప్?

Purushottham Vinay
ఫేస్ తెల్లగా కనబడాలని మనలో చాలా మంది కూడా చాలా రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు.అందుకోసం గాను ఎంతో డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ లభించే క్రీములను ఇంకా అలాగే వైటనింగ్ లోషన్స్ ను చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు.అయితే ఎటువంటి రసాయనాలు లేకుండా సహజ సిద్దపదార్థాలను ఉపయోగించి మన ఇంట్లోనే ఫేస్ వైటనింగ్ సీరమ్ ను తయారు చేసుకుని వాడడం వల్ల మనం ముఖాన్ని చాలా అందంగా మార్చుకోవచ్చు.ఇందుకు చిటికెడు కుంకుమ పువ్వును, చిటికెడు పసుపును, రెండు టీ స్పూన్ల గోరు వెచ్చని నీటిని ఇంకా అలాగే మూడు టేబుల్ స్పూన్ల కలబంద జెల్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా కుంకుమ పువ్వును వీలైనంత మెత్తని పొడిలాగా చేసుకోని ఆ తరువాత ఒక గిన్నెలో గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో కుంకుమ పువ్వు పొడిని వేసి బాగా కలపాలి. దీనిని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపిన తరువాత పసుపు వేసి కలపాలి. ఇలా కలిపిన తరువాత దీనిని ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.


అలాగే ఇప్పుడు ఒక గిన్నెలో కలబంద జెల్ ను తీసుకోని ఆ తరువాత ఇందులో ముందుగా తయారు చేసుకున్న కుంకుమ పువ్వు నీటిని పోసి బాగా కలపాలి.ఇక ఇలా తయారు చేసుకున్న సీరమ్ ను ప్రతి రోజూ రాత్రి పూట పడుకునే ముందు ముఖానికి రాసుకుని రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మన ముఖం ఖచ్చితంగా చాలా తెల్లగా మారుతుంది.ముఖంపై ఉండే మచ్చలు ఇంకా నలుపుదనం తొలగిపోయి ముఖం కాంతివంతంగా, తెల్లగా మారుతుంది.అలాగే ఈ సీరమ్ ను ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇక ఈ సీరమ్ ను తయారు చేయడంలో వాడిన పదార్థాలన్నీ సహజ సిద్దమైనవే.అందువల్ల దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.కాబట్టి ఖచ్చితంగా దీన్ని ట్రై చెయ్యండి. మెరిసే అందమైన తెల్లటి చర్మాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: