పెదాలు పగలకుండా మృదువుగా అందంగా ఉండాలంటే?

Purushottham Vinay
పగిలిన పెదాలకు బాదం నూనె, తేనె, ఒక టీ స్పూన్ చక్కెర తీసుకుని మిశ్రమంగా మార్చుకోని ఆ తరువాత దానిని పెదవులకు స్క్రబ్‌గా వేసుకోవాలి. ఆ తరువాత పెదవులపై సున్నితంగా అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల పెదవులపై మృతచర్మం చాలా ఈజీగా తొలగిపోతుంది.దెబ్బకు మీ పెదవులకు తేమ వచ్చి గులాబీ రంగు పెదాలు మీ సొంతమవుతాయి.అలాగే కలబందని తీసుకొని దానిలోని గుజ్జును వేరు చేసి ఆ గుజ్జును పెదవులపై అప్లై చేయటం వల్ల కూడా పెదవులను మృధువుగా ఇంకా అందంగా మార్చుకోవచ్చు.అలాగే మీరు రాత్రి నిద్రపోయే ముందు పెదవులకు కొబ్బరి నూనె లేదంటే నువ్వుల నూనెను రాసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయటం వల్ల పెదవులు పొడి బారకుండా ఆరోగ్యంగా ఉంటాయి.అలాగే రోజువారిగా నీటిని సరిపడిన మోతాదులో తాగాలి. డీ హైడ్రేషన్ కారణంగా కూడా మన పెదవులు పొడిబారిపోతాయి. అందువల్ల అవి కళావిహీనంగా మారతాయి. కాబట్టి రోజువారిగా తగిన మోతాదులో నీరు తాగితే పెదవులు తాజాగా మెరుపుదనంతో ఉంటాయి.అలాగే పెదవులుకు చాలా మంది లిఫ్స్టిక్ ని వేస్తుంటారు.


అయితే రసాయనాలతో తయారయ్యే లిప్టిక్ వల్ల పెదవుల సహజత్వం అనేది బాగా దెబ్బతింటుంది. కాబట్టి  దానిమ్మ రసం, బీట్ రూట్ రసాన్ని ఉపయోగించటం ద్వారా మన పెదవులు మంచి రంగులో ఉండేలా చూసుకోవచ్చు. ఇంకా అలాగే అంతేకాకుండా పొడి బారటాన్ని కూడా నివారించవచ్చు.అలాగే లిఫ్టిక్ ను డైరెక్ట్ గా పెదవులపై వేసుకోకుండా ముందుగా పెదవులకు కొంచెం కొబ్బరినూనెని అప్లై చేసుకోవాలి. ఆ తరువాత మాత్రమే లిఫ్టిక్ ని పూసుకోవాలి. కొబ్బరి నూనె పెదవులకు నష్టం కలగకుండా మంచి రక్షణ కవచంలా సహాయపడి అది పెదవులకు తేమను అందిస్తుంది.గులాబీ రేకులను తీసుకొని వాటిని పాలలో నానబెట్టి ఇంకా మెత్తగా నూరి పెదాలకు పట్టించాలి. ఇలా చేస్తే పెదాలు పగలకుండా చాలా అందంగా ఇంకా మృదువుగా ఉంటాయి. వారానికి ఒకసారి టూత్ బ్రష్ తో పెదాలపై మృదువుగా రుద్దితే అక్కడ ఉన్న మృత చర్మం కూడా చాలా ఈజీగా పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: