పట్టులాంటి జుట్టు కావాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
పాలు తాగడం  ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది.ఇంకా అలాగే మన జుట్టుకు కూడా పాలు బాగా మేలు చేస్తుందని కేవలం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు..ఇక ఆరోగ్యవంతమైన పట్టులాంటి జుట్టు కోసం పచ్చి పాల వల్ల కలిగే మేలు ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక పాలలో ఉండే ప్రొటీన్ మన జుట్టును ఎంతగానో బలపరుస్తుంది. అలాగే సన్నని బలహీనమైన జుట్టును కూడా చాలా బలంగా ఇంకా మందంగా చేస్తుంది. ఈ పాలలో ప్రొటీన్‌తో పాటు క్యాల్షియం కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని సులభంగా నివారించడంలో సహాయపడటమే కాకుండా  జుట్టు పెరుగుదలను వేగవంతం చేయడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.ఇంకా అలాగే విటమిన్ ఎ, విటమిన్ బి బయోటిన్ పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పాలలో చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన జుట్టు పెరుగుదలలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.


అలాగే బట్టతలను ఈజీగా నివారించడంలో కూడా పచ్చిపాలు చాలా బాగా పనిచేస్తాయి. పాలు సహజమైన క్లెన్సర్ ఇంకా మాయిశ్చరైజర్ గా పని చేస్తాయి.అందుకే పాలు చర్మానికే కాదు జుట్టుకు కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇది డ్రై ఫ్రిజ్జీ, మూవింగ్ లేయర్స్ కర్లీ హెయిర్ సమస్యను కూడా చాలా ఈజీగా తొలగిస్తుంది. అంతేగాక మీ జుట్టుకు సహజమైన షైన్‌ని కూడా అందిస్తుంది. ఇంకా అలాగే జుట్టును చాలా మృదువుగా కూడా చేస్తుంది.జుట్టు నుండి చుండ్రు ఇంకా అలాగే పొడిని తొలగించడానికి, కలబంద, పచ్చి పాల మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేయండి. దీని వల్ల జుట్టులో తేమ వచ్చి, పొడిబారడంతోపాటు చుండ్రు సమస్య రాకుండా కూడా చాలా ఈజీగా దూరమవుతుంది.పచ్చి పాలను జుట్టుకు అప్లై చేయడం వల్ల స్కాల్ప్ ఇంకా అలాగే హెయిర్ ఫోలికల్స్ కు మంచి పోషణ అందుతుంది. నెత్తిమీద తేమ కూడా అలాగే ఉంటుంది. ఇది జుట్టు పొడిబారకుండా నిరోధించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: