ముఖంపై మంగు ఈజీగా తగ్గే టిప్స్?

Purushottham Vinay
మంగు సమస్య ఈజీగా తగ్గాలంటే టమాట గుజ్జును మచ్చలపై బాగా రాసి 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు తగ్గి శరీర కాంతి కూడా పెరుగుతుంది. ఒక గిన్నెలో శనగపిండి, పెరుగు, నిమ్మరంసం ఇంకా అలాగే రోజ్ వాటర్ వేసి బాగా పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి ప్యాక్ లా వేసుకుని అరగంట తరువాత కడగాలి. ఈ టిప్స్ పాటించడం వల్ల మంగు మచ్చలతో పాటు ఇతర సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. కలబంద గుజ్జును మచ్చలపై రాయాలి. ఆరిన తరువాత నీటితో కడగాలి. దీని వల్ల మచ్చలు కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయి. అంతేకాకుండా ముఖం పై ఉండే మొటిమలు కూడా తగ్గుతాయి. బంగాళాదుంపని తీసుకొని దాని రసంలో దూదిని ముంచి ముఖానికి రాసుకోవాలి. ఒక 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ టిప్స్ పాటించడంతో పాటు తాజా పండ్లను, కూరగాయలను తీసుకోవడం ఇంకా అలాగే ఎండలో బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలను పాటించడం వంటివి చేయడం వల్ల మంగు మచ్చలను మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు.ఇంకా అలాగే ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంగు మచ్చలతో పాటు ఇతర చర్మ సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి.


ఇంకా అలాగే గేదె పాల నుండి తీసిన వెన్నను మంగు మచ్చలపై రోజూ రుద్దుతూ ఉంటే మంగు మచ్చలు తగ్గిపోతాయి. ఇంకా అలాగే పచ్చి పసుపు, చందనం లో పచ్చి పాలను కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం పై రాయడం వల్ల మంగు మచ్చలతో పాటు ఇతర నల్ల మచ్చలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి.ఇంకా అలాగే కోడిగుడ్డు తెల్లసొనలో ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి ఇంకా మెడకు పట్టించాలి. అలాగే అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి. అదేవిధంగా జాజికాయను మేకపాలల్లో అరగదీసి ఆ మిశ్రమాన్ని మంగు మచ్చలపై బాగా రాయాలి.ఇలా చేయడం వల్ల కూడా మంగు మచ్చలు చాలా ఈజీగా తగ్గుతాయి. ఒక గిన్నెలో నిమ్మరసాన్ని తీసుకుని దానికి సమానంగా తేనెను కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఒక 20 నిమిషాల తరువాత నీటితో కడిగివేయాలి.ఇలా నెల రోజుల పాటు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: