తెల్లని జుట్టు నల్లగా మారే సూపర్ టిప్?

Purushottham Vinay
ప్రస్తుతం చాలా మందికి కూడా అసలు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా తెల్ల వెంట్రుకలు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే వాతావరణంలో పెరిగిన కాలుష్యం ఇంకా అలాగే తినే ఆహారంలో పోషకాలు లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత ఇలా ఎన్నో కారణాల వలన జుట్టు రాలడం, తెల్ల వెంట్రుకలు రావడం జరుగుతూ ఉంటుంది.తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండడం కోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల హెయిర్ డ్రైస్ ను, ఆయిల్స్ ను ఉపయోగిస్తారు. వాటిలో కెమికల్స్ ఉండడం వలన ఉన్న సమస్యకి తాత్కాలిక పరిష్కారం లభిస్తుంది. కానీ కెమికల్స్ వలన అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ పద్ధతిలో తెల్ల వెంట్రుకలను సులువుగా నల్లగా మార్చుకోవచ్చు.ఈ నేచురల్ హెయిర్ కలర్ ను ఉపయోగించడం వలన జుట్టు నల్లబడటమే కాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.చాలా తక్కువ ఖర్చుతోనే తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చుకోవచ్చు. ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి ముందుగా జుట్టుకు సరిపడినంత బీట్రూట్ ఒకటి లేదా రెండును తీసుకోవాలి. బీట్రూట్ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.


ఈ మిశ్రమాన్ని ఏదైనా క్లాత్ లో వేసి వడకట్టుకొని జ్యూస్ తీసుకోవాలి. ఈ జ్యూస్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెట్టుకొని స్టవ్ మీద పెట్టి ఒక గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక కప్పు ఉసిరికాయ పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.తర్వాత దీనిలో ముందుగా తీసి పక్కన పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ చేసి దగ్గరకి అయ్యేంతవరకు ఉడకనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ పేస్ట్ ను కడాయి మొత్తం సర్ది మూత పెట్టాలి. ఈ పేస్ట్ లో ఐరన్ కలవడం వలన బ్లాక్ కలర్ లోకి వస్తుంది. ఈ పేస్టును జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత రెండు గంటల పాటు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వలన తెల్ల వెంట్రుకలు శాశ్వతంగా పోతాయి. ఉసిరి పొడి జుట్టును నల్లగా చేస్తుంది. అలాగే చుట్టు రాలడాన్ని, చుండ్రును తగ్గిస్తుంది. ఈ టిప్ ని అన్ని వయసులవారు ట్రై చేయవచ్చు.కాబట్టి ఎవరికైతే ఈ సమస్యలు ఉంటాయో వారు ఖచ్చితంగా ఈ టిప్ ని పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: