ఈ నూనె వాడితే జుట్టు అసలు ఊడిపోదు?

Purushottham Vinay
ప్రస్తుతం అందరికీ కూడా జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా ఉంది.. కుదులు అనేవి చాలా బలహీనంగా ఉండడం, చుండ్రు, డ్రై స్కాల్ఫ్ ఇంకా జుట్టు చివర్లు చిట్లిపోవడం ఇలా అనేక రకాల కారణాలవల్ల జుట్టు బాగా ఊడిపోతుంది..ఇక జుట్టు రాలకుండా ఫాస్ట్ గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి మన ఇంట్లో ఉండే ఈ ఆకులతో నూనె తయారు చేసుకుని వాడితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక ఇంతకీ ఆ నూనె ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం..ఇక సాదారణంగా మందార ఆకులు జుట్టు చాలా ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి.. ఈ నూనె తయారు చేసుకోవడానికి గుప్పెడు మందార ఆకులు, కరివేపాకులు, వేప ఆకులు, ఒక చెంచా మెంతులు ఇంకా అలాగే ఒక కప్పు కొబ్బరి నూనె చాలా అవసరం.. మిక్సీ జార్ తీసుకొని అందులో మందార ఆకులు వేపాకులు ఇంకా కరివేపాకు ఆకులు మెంతులు వేసి నీళ్లు పోయకోకుండానే మిక్సీ పట్టుకోవాలి.


ఇక అలా కచ్చా పచ్చా గా ఉన్న మిశ్రమాన్ని ఒక పాత్రలో వేసుకొని ఒక కప్పు నూనెను పోసి స్టవ్ పై పెట్టి తరువాత బాగా మరిగించాలి..ఇక ఈ నూనె బాగా మరిగిన తర్వాత వడపోసుకుని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనె ఖచ్చితంగా రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది.మీరు కావాలనుకుంటే ఒకేసారి ఒక లీటర్ నూనె వరకు కూడా ఈ నూనెని తయారు చేసుకోవచ్చు.ఇక ఇలా సిద్ధం చేసుకున్న నూనెను మీ జుట్టు కుదుళ్లకు రాసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు కనుక రాసుకుంటే ఖచ్చితంగా జుట్టు రాలడం తగ్గుతుంది. ఇంకా అలాగే చుండ్రు సమస్య కూడా చాలా ఈజీగా పోతుంది. ఇంకా అలాగే జుట్టు చివర్లు చిట్లిపోతే వాటిని రిపేర్ చేసి మళ్లీ జుట్టు ఎదగడానికి కూడా చాలా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: