నోటి దుర్వాసన తగ్గి నోటిని ఫ్రెష్గా ఉంచే టిప్..!

Purushottham Vinay
ఉదయం సమయంలో చాలా మంది కూడా చేసే తప్పు ఏంటంటే అసలు బ్రష్ చేయకుండానే పాచి నోటితో కాఫీ,టీ తాగేస్తూ ఉంటారు.ఇక చాలా సంవత్సరాల నుంచే ఇదే అలవాటుగా చేసుకుంటారు.ఇక అలా అసలు చేయనే చేయకూడదు. అలా చేస్తే నోటిలో బ్యాక్టీరియా అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. నోటి శుభ్రత లేకపోతే దంతాలు కూడా బాగా క్షీణిస్తాయి. ఇంకా అలాగే పుచ్చిపోతాయి. అలాగే అలా టీ కాని కాఫీ కాని తాగడం వల్ల మీ నోటిలోని బాక్టీరియా నేరుగా మీ కడుపులోకి పోతుంది.ఇంకా నోటి దుర్వాసన సమస్య కూడా ఎక్కువగా వస్తుంది.ముందు ఆ అలవాటుని మార్చుకోండి. ఇక వాసన తగ్గాలంటే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి దాన్ని నోటిలో పోసుకొని బాగా పుక్కిలించాలి. ఈ విధంగా రోజుకి రెండు లేదా మూడు సార్లు చేయాలి.


ఇంకా అలాగే బయటకు వెళ్ళే ముందు కూడా ఇలా చేస్తే నోటి దుర్వాసన అనేది ఉండదు. ఇక అలాగే మరో చిట్కా ఏంటో తెలుసుకుందాం. మసాలా దినుసుగా ఉపయోగించే లవంగాలు నోటి దుర్వాసన తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది. రెండు లవంగాలను నములుతూ ఆ రసాన్ని మీరు మింగాలి. లవంగాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటిలో బ్యాక్టీరియా ఈజీగా తొలగిపోయేలా చేస్తుంది.ఇక నోటి దుర్వాసన తగ్గటమే కాకుండా చిగుళ్ళ సమస్యలను కూడా ఈజీగా తగ్గిస్తుంది. అలాగే రక్తస్రావం ఇంకా అలాగే దంత క్షయం వంటి సమస్యలకు ఈజీగా చెక్ పెడుతుంది. నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు ఈ రెండు చిట్కాలను కనుక పాటిస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది.కాబట్టి ఈ ఉపయోగకరమైన టిప్స్ ని క్రమం తప్పకుండా కూడా పాటించండి.. ఖచ్చితంగా మీకు నోటి దుర్వాసన సమస్య అనేది ఇక ఉండదు.. నోరు ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: