మోకాళ్లు, మో చేతుల పై ఉండే నలుపు పోవాలంటే ఇలా చేస్తే సరిపోతుంది..

Divya

మోకాళ్లు, మో చేతుల పై ముదురు నలుపు రంగు చాలా సౌందర్య సమస్యలలో ఒకటి. ఈ భాగాలు చాలా నల్లగా కనిపిస్తే , ఇందుకోసం మీకు ఒక పేస్ట్  చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఈ రెండింటిని తొలగించాలి అంటే    ఆ పేస్ట్ ఏదో కాదు కరివేపాకు పేస్ట్ . ఇది ఎంతగానో సహాయ పడుతుంది. అయితే ఈ కరివేపాకు ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:
కరివేపాకు - ఎనిమిది నుంచి తొమ్మిది ఆకులు,
నిమ్మరసం - రెండు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
మొదట కరివేపాకు ఆకులు ఎనిమిది నుంచి తొమ్మిది ఆకులు తీసుకొని , ఒక బాణలిలో వేసి ,చిన్న మంట పైన బాగా వేయించాలి. తర్వాత ఈ ఆకులను మెత్తటి పొడి లాగా తయారు చేసి, ఈ పొడికి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం , అవసరమైతే రెండు నుండి మూడు చుక్కల రోజ్ వాటర్ ను కలపవచ్చు. ఇక ఇలా కలిపిన మిశ్రమాన్ని మెత్తటి పేస్టులాగా తయారుచేసి మోకాళ్ళు, మోచేతుల పై ఎక్కడైతే నల్లగా ఉంటుందో, ఆ ప్రదేశాలలో అప్లై చేసి, పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ మీ చర్మం పొడిగా అనిపిస్తే , అందుకు మాయిశ్చరైజర్ కూడా రాసుకోవచ్చు. ఇలా తరచూ చేయడం వల్ల అతి తక్కువ కాలంలో ని నలుపుదనం తగ్గడాన్ని గమనించవచ్చు..
ఇలా కరివేపాకు మీ చర్మాన్ని మృదువుగా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది . ఇందుకోసం ఎనిమిది నుంచి పది కరివేపాకు ఆకులు, ఒక కప్పు ఆలివ్ ఆయిల్ తీసుకోండి.  మొదట కరివేపాకు వేయించి, పొడి చేసుకొని ఒక గిన్నెలో వేసి, అందులో ఆలివ్ ఆయిల్ కూడా వేసి బాగా కలపాలి.  దీన్ని మోకాళ్లు మో చేతుల పై నల్లగా ఉండే ప్రదేశంలో అప్లై చేసి, 15 నిమిషాలు ఉంచి, ఆ తర్వాత ఒక తడి గుడ్డతో తుడిచి వేయాలి . ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా చేయడం వల్ల మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. అంతేకాకుండా ఈ ప్యాక్ ను ముఖానికి పట్టించినా కూడా మొటిమలు రాకుండా ఉంటాయి .చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: