షావోమీ నుంచి సూపర్ ఫీచర్లతో సూపర్ ఎలక్ట్రిక్ కార్?

Purushottham Vinay
షావోమీ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.చైనా దేశానికి చెందిన ఈ స్మార్ట్ ఫోన్‌ కంపెనీ టెక్‌ మార్కెట్లో చెరగని ముద్రని వేసింది.మొదట్లో బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని స్మార్ట్ ఫోన్స్‌ను తీసుకొచ్చిన షావోమీ కంపెనీ ఆ తర్వాత ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌ను కూడా తీసుకురావడం జరిగింది.ఇక ఆ తర్వాత షావోమి టెక్‌ మార్కెట్లో చాలా రకాల గ్యాడ్జెట్స్‌ను తీసుకొచ్చాయి.రోబో వ్యాక్యూమ్‌ క్లీనర్‌ మొదలు స్మార్ట్ వాచ్‌లు, ఇయర్‌ బడ్స్‌తో పాటు ఇలా చాలా అధునాతన ఫీచర్లతో కూడిన ప్రొడక్ట్స్‌ను లాంచ్‌ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏకంగా కార్లను తీసుకొచ్చే పనిలో పడింది షావోమీ కంపెనీ. షావోమీ కంపెనీ నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్‌ కారును తీసుకొస్తున్నారు. షావోమి కంపెనీ ఎస్‌యూ7 పేరుతో ఈ కారును లాంచ్‌ చేయనున్నారు.ఇక ఇప్పటికే షావోమీ ఈ కార్లకు సంబంధించి లైసెన్స్‌ కోసం చైనాలో దరఖాస్తుని చేసుకున్నారు. అయితే షావోమీ కంపెనీ ఈ కార్లను స్వయంగా డిజైన్ చెయ్యడం లేదు..'బీజింగ్‌ ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ హోల్డింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ (BAIC)' సహకారంతో ఈ కార్లను కంపెనీ తయారు చేస్తోంది.


ఇందు కోసం సదరు కంపెనీకి కాంట్రాక్టుకు కూడా ఇచ్చింది. ఇక చైనా ఇండస్ట్రీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం కంపెనీ ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా షావోమీ ఎలక్ట్రిక్‌ కారుకు సంబంధించి కొన్ని వివరాలను విడుదల చేయడం జరిగింది.సెడాన్‌ విభాగంలో ఈ కారును కంపెనీ తీసుకొస్తోంది. ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే ఇందులో వీల్‌బేస్‌ 3000 ఎంఎంగా ఇవ్వనున్నారు. లైడర్‌ సెన్సర్‌ వంటి అప్డేటెడ్ ఫీచర్‌ను కూడా అందించనున్నారు. ఇక ఈ కారులో 'ఫేస్‌ రికగ్నిషన్‌ అన్‌లాకింగ్‌' ఫీచర్‌ను కూడా ఇవ్వనున్నారని సమాచారం తెలుస్తోంది. అంటే స్మార్ట్‌ ఫోన్‌ను ఎలా అయితే మొహం చూపించి అన్‌లాక్‌ చేసుకుంటున్నామో అలాగే కారు కూడా కీ లేకుండా అన్‌లాక్‌ చేసకోవచ్చు. ఇక ఈ కారులో రెండు రకాల బ్యాటరీలను కంపెనీ వారు అందించారు. వీటిలో ఒకి 220 కిలోవాట్‌ మోటార్‌తో కూడిన 'రియర్‌ వీల్‌ డ్రైవ్‌ (RWD)'.. కాగా మరొకటి 495 కిలోవాట్‌ మ్యాగ్జిమమ్‌ పవర్‌తో కూడిన 'ఆల్‌ వీల్‌ డ్రైవ్‌'ను కూడా ఇవ్వనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: