ఈ లేటెస్ట్ లగ్జరీ కార్లపై భారీ తగ్గింపులు?

Purushottham Vinay
కార్ కొనాలి అందులో ఎక్కి షికారు చెయ్యాలని చాలా మందికి కోరిక ఉంటుంది. ఇక కారు కొనాలనుకునే వారికి చాలా కంపెనీలు దీపావళి ఆఫర్లు ఇస్తున్నాయి. ఇక హ్యుందాయ్ కంపెనీ కూడా చాలా మంచి పండుగ ఆఫర్ ఇస్తుంది. ఆ కంపెనీ ఆఫర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్.. దీని ధర మన దేశంలో రూ. 23.84లక్షల నుంచి రూ. 24.03 లక్షల దాకా ఉంటుంది. దీనిపై మీకు రూ. 2లక్షల దాకా డిస్కౌంట్ లభిస్తుంది.ఈ కార్ లో 39.2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై ఏకంగా 451 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది 134.14బీహెచ్పీ ఇంకా 395ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

అలాగే సిట్రోయిన్ సీ5 ఎయిర్ క్రాస్ కారుపై రూ. 2.5లక్షల దాకా తగ్గింపు లభిస్తుంది. ఈ కార్ యూనిక్ డిజైన్ తో కంఫర్టబుల్ జర్నీని అందిస్తుంది. ఇందులో 2.0లీటర్ల డీజిన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 174.57 బీహెచ్పీ ఇంకా 400ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 36.91 లక్షల నుంచి రూ. 37.67లక్షలు దాకా ఉంటుంది.

ఇంకా మహీంద్రా ఎక్స్‌యూవీ400.. దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కారు ఇది. దీనిపై మీకు రూ. 3లక్షల దాకా ఆఫర్ వస్తుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 15.99 నుంచి 19.19 లక్షల దాకా ఉంటుంది. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. 34.5 కేడబ్ల్యూహెచ్ ఈసీ, 375 కిలోమీటర్ల రేంజ్ తో వస్తుంది.39.4 కేడబ్ల్యూహెచ్ ఈఎల్, 456కిలోమీటర్ల రేంజ్ తో వస్తుంది. ఇది మోటార్ 147.94 బీహెచ్పీ, 310 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

అలాగే ఎంజీ జెడ్ఎస్ ఈవీ.. ఎంజీ కంపెనీ నుంచి వచ్చిన ఫస్ట్ ఫుల్లీ ఎలక్ట్రిక్ కారు ఇది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 22.88లక్షల నుంచి రూ. 26లక్షల దాకా ఉంటుంది. దీనిపై మీకు పండుగ ఆఫర్లలో భాగంగా రూ. 2.3లక్షల దాకా డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో 50.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై మొత్తం 461 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనికి 174.57బీహెచ్పీ, 280ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేసే మోటార్ ఉంటుంది.

అలాగే టోయోటా హైలక్స్ అనేది గ్లోబల్ వైడ్ గా మంచి డిమాండ్ ఉన్న ట్రక్ కార్ ఇది. దీనిపై ఈ ఫెస్టివల్ సీజన్లో రూ. 5లక్షల దాకా తగ్గింపును పొందొచచు. మీరు  అవుట్ డోర్ ప్రయాణాలు ఎక్కువగా చేసే వారైతే ఈ కారు చాలా బాగా సరిపోతోంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 30.40 లక్షల నుంచి రూ. 37.90 లక్షల దాకా ఉంటుంది. ఇందులో 2.8 లీటర్ టర్బో చార్జెడ్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది మాక్సిమం 201.20 పవర్ అవుట్ పుట్ ను అందిస్తుంది. ఇది 500ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: