టాటా: కస్టమర్ల సేఫ్టీ విషయంలో నెంబర్ వన్?

Purushottham Vinay
గ్లోబల్ NCAP ఇటీవల టాటా కంపెనీకి చెందిన టాటా హారియర్‌, టాటా సఫారీ ఎస్‌యూవీలకు క్రాష్‌ టెస్ట్‌ ని నిర్వహించింది. ఈ క్రాష్‌ టెస్ట్‌లో  హారియర్, సఫారీ ఎస్‌యూవీలు ఏకంగా 5 స్టార్‌ రేటింగ్‌ను పొందాయి.గ్లోబల్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ దక్కించుకున్న కార్ల లిస్ట్ లో ఇప్పుడు టాటా హారియర్‌, టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్‌లు చేరాయి. గ్లోబల్‌ NCAP ప్రొటోకాల్‌, కఠినమైన టెస్టింగ్‌ ఏజెన్సీకి అనుగుణంగా ఈ కార్లను టాటా మోటార్స్‌ డిజైన్ చేసింది. అయితే ఈ లిస్ట్ లో టాటాకు చెందిన ఇతర  కార్లు కూడా ఉన్నాయి.ఇప్పటికే టాటా ఆల్ట్రోజ్, నెక్సాన్ ఇంకా పంచ్ మోడల్‌లు 5 స్టార్‌ రేటింగ్‌ను పొందిన సంగతి తెలిసిందే.అలాగే టాటా టియాగో, టాటా టిగోర్‌ ఎస్‌యూవీలు 4 స్టార్‌ రేటింగ్‌(Global NCAP)లో ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్వదేశీ తయారీ సంస్థ కస్టమర్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని దీని ద్వారా పూర్తిగా స్పష్టమవుతోంది.ఇక టాటా హారియర్‌ను 2019లో మార్కెట్లోకి ప్రవేశపెట్టగా.. టాటా సఫారీ కార్ 2021లో ప్రారంభమైంది.



ఇటీవల వాటి అప్‌డేట్లను టాటా మోటార్స్‌ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.  గ్లోబల్ NCAP ద్వారా ఇచ్చే రేటింగ్‌ల కోసం టాటా ఇప్పుడు కొత్త ఫేస్‌లిఫ్ట్ వాహనాలను మాత్రమే క్రాష్‌ టెస్ట్‌కు పంపింది. కొత్త హారియర్, సఫారీ బాడీ షెల్స్‌ను మాత్రం పాత మోడల్‌ లాగానే డిజైన్ చేశారు.కొత్త 2023 టాటా హారియర్, సఫారీ అడల్ట్‌ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విషయంలో 34 పాయింట్లకు గాను ఏకంగా 33.05 స్కోర్ చేశాయి. క్రాష్‌ టెస్ట్‌ సమయంలో, ఈ రెండు వాహనాలు డ్రైవర్, ప్రయాణీకుల తల, మెడ రక్షణలో మెరుగైన ఫలితాలు కనబరిచాయి. అలాగే డ్రైవర్, ప్రయాణీకుల ఇద్దరికి చెస్ట్‌ సేఫ్టీ విషయంలో మంచి మార్కులు సాధించాయి.ఇక సైడ్ ఇంపాక్ట్ టెస్టింగ్‌లో సఫారీ, హారియర్‌ ఫేస్‌లిఫ్ట్‌లు తల, ఛాతీ, పొత్తికడుపు ఇంకా పెల్విస్‌కు హై ప్రొటెక్షన్‌ను కల్పించాయి. ఫిట్‌మెంట్ అవసరాలకు తగ్గట్లు కర్టెన్‌ ఎయిర్‌బ్యాగ్‌లను ఈ SUVలలో స్టాండర్డ్‌గా అందించారు. ఇక సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లలో తల ఇంకా పెల్విస్‌కు హై సేఫ్టీ ప్రొటెక్షన్‌, చెస్ట్‌కి, పొత్తికడుపుకు తగిన రక్షణ కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: