ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీగా ఓలా కంపెనీ ప్రజాదరణ పొందింది. ఓలా కంపెనీ విక్రయిస్తున్న 'S1' సిరీస్ స్కూటర్ల పట్ల ఇప్పటికే మార్కెట్లో సూపర్ క్రేజ్ ఉంది.ఓలా ఎస్1 ఎయిర్‌కు సంబంధించి ఓలా ఎలక్ట్రిక్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్ 'S1 ఎయిర్'ని మార్కెట్లో విడుదల చేయనుంది.అయితే, లాంచ్ తేదీ గురించి వీడియోలో ఎలాంటి సమాచారం లేదు.గతంలో ఈ కంపెనీ బెంగళూరులో టార్మాక్‌పై 'S1 ఎయిర్' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టెస్ట్ చేసింది.ఇక ప్రస్తుత వీడియోలో రైడర్లు వివిధ రంగుల్లో లభించే S1 ఎయిర్ స్కూటర్లను టార్మాక్‌పై వేగవంతంగా నడిపిస్తున్నారు. దీని ద్వారా వాటి సామర్థ్యాలను ప్రదర్శించడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. ఇది S1 సిరీస్ ఎంట్రీ లెవెల్ స్కూటర్. ఈ స్కూటర్ బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి.ఇక ఓలా S1 ఎయిర్ ప్రధానంగా FAME సబ్సిడీ రేట్లలో కేంద్ర ప్రభుత్వం సవరించిన నేపథ్యంలో మొత్తం రూ.1.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
ఈ ఇ బైక్ 3 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికతో వస్తుంది. ఇక పూర్తి ఛార్జ్‌పై మొత్తం 125 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. అలాగే మాక్సిమం గంటకు 85 కి.మీ వేగంతో ఈ స్కూటర్ ప్రయాణిస్తుంది.ఈ ఓలా ఎస్ 1 ఎయిర్ డ్రమ్ బ్రేక్ ఆప్షన్ తో వస్తుంది. దీని బ్యాటరీ 4 గంటల 30 నిమిషాలలో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇంకా ఈ స్కూటర్లో మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. ఇది ఎకో, నార్మల్, స్పోర్ట్స్. డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్, LED లైటింగ్, మ్యూజిక్ కంట్రోల్, రిమోట్ అన్లాకింగ్, సైడ్-స్టాండ్ అలర్ట్ ఇంకా OTA అప్డేట్ వంటి అప్డేటెడ్ ఫీచర్లు ఉన్నాయి.ఓలా కంపెనీ ఇండియన్ మార్కెట్లో అమ్ముతున్న ఇతర S1 సిరీస్ స్కూటర్ గురించి మాట్లాడుకుంటే, మిడ్ లెవల్ వెర్షన్ 'S1' ధర వచ్చేసి రూ.1.30 లక్షలు ఎక్స్-షోరూమ్‌లో ఉంది. ఇది మొత్తం 141 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.ఇక టాప్-ఎండ్ మోడల్, 'ఎస్1 ప్రో' స్కూటర్ రూ.1.40 లక్షల ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.దీన్ని పూర్తిగా ఛార్జ్ చేస్తే 181 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.